Studio18 News - జాతీయం / : Nirmala Sitharaman : కేంద్ర బడ్జెట్ పై విశాఖలో నిర్వహించిన చర్చలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత దేశవ్యాప్త చర్చలు నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. మొదట ముంబైలో, రెండో చర్చ విశాఖలో నిర్వహించామన్నారు. విశాఖలో బడ్జెట్ పై వివిధ వర్గాల ప్రజలను కలిసి వారి సలహాలు, సూచనలు తీసుకున్నామని మంత్రి నిర్మల తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ కి అధిక ప్రాధాన్యత ఇచ్చాం. కేంద్ర ప్రభుత్వంగా కాదు, మా బాధ్యతగా సహకారం అందిస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఎక్కువ మొత్తం కేటాయించాం. స్టీల్ ప్లాంట్ పునరాభివృద్ధికి 11వేల కోట్లు సహకారం అందిస్తున్నాము. పారిశ్రామిక కారిడార్, అమరావతి రాజధానికి కేంద్రం నుంచి సహకారం అందిస్తున్నాం. కేంద్రం, రాష్ట్రం కలిసి చేస్తున్న అన్ని ప్రాజెక్టులకు లోటు లేకుండా కేటాయింపులు చేస్తున్నాం. సాంకేతిక సమస్యలతో పోలవరం ప్రాజెక్ట్ ఆలస్యం అవుతోంది. విభజన సమయంలో పోలవరం పూర్తి చేస్తామని హామీ ఇచ్చాము. కచ్చితంగా పోలవరం ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తాం.
Admin
Studio18 News