Thursday, 12 March 2026 01:16:02 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Asha Cheetah: కూనో నేషనల్ పార్కులో ఐదు చీతా కూనల జననం

Date : 07 February 2026 07:10 PM Views : 148

Studio18 News - జాతీయం / : రెండోసారి పిల్లలకు జన్మనిచ్చిన‌ నమీబియా చీతా ‘ఆశా’ దేశంలో 35కి చేరిన మొత్తం చీతాల సంఖ్య ప్రాజెక్ట్ చీతా విజయంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల హర్షం ఈ నెల 28న బోట్స్వానా నుంచి మరో 8 చీతాల రాక మధ్యప్రదేశ్‌లోని కూనో నేషనల్ పార్కులో (KNP) ‘ప్రాజెక్ట్ చీతా’ మరో కీలక మైలురాయిని అందుకుంది. నమీబియా నుంచి తీసుకొచ్చిన ‘ఆశా’ అనే ఆడ చీతా ఐదు కూనలకు జన్మనిచ్చింది. రెండేళ్లలో ఆశా పిల్లలకు జన్మనివ్వడం ఇది రెండోసారి కావడం విశేషం. ఈ పరిణామం భారత్‌లో చీతాల పునఃప్రవేశ కార్యక్రమం విజయవంతం అవుతోందనడానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఈ శుభవార్తను మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ సోషల్ మీడియా ‘ఎక్స్’ ద్వారా పంచుకున్నారు. ఇది రాష్ట్రానికే కాకుండా దేశానికే గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. "ఈ కొత్త జననాలతో భారత్‌లో పుట్టిన చీతా కూనల సంఖ్య 24కు, మొత్తం చీతాల సంఖ్య 35కి చేరింది. అటవీ సిబ్బంది, పశువైద్యుల అవిశ్రాంత కృషి వల్లే ఇది సాధ్యమైంది" అని ఆయన తెలిపారు. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ కూడా ఈ విషయంపై హర్షం వ్యక్తం చేశారు. "ఆశా వారసత్వం ముందుకు సాగుతోంది. తన ఐదు కూనలకు భారత్ స్వాగతం పలుకుతోంది" అని ఆయన పోస్ట్ చేశారు. భారత గడ్డపై ఇది ఎనిమిదో విడత చీతాల జననం అని, వన్యప్రాణి సంరక్షణలో ఇది చరిత్రాత్మక ఘట్టమని అభివర్ణించారు. 2022 సెప్టెంబర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ నమీబియా నుంచి తీసుకొచ్చిన 8 చీతాలను కూనో పార్కులో విడుదల చేశారు. ఆ మొదటి బృందంలో ఆశా కూడా ఉంది. ఇదివరకే 2024 జనవరి 3న ఆశా మూడు కూనలకు జన్మనిచ్చింది. ఇక‌, ఈ నెల‌ 28న బోట్స్వానా నుంచి మరో 8 చీతాలు మధ్యప్రదేశ్‌కు రానున్నాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :