Monday, 23 June 2025 02:55:14 PM
# ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు # గాంధీ భవన్ ముందు గొర్రెల మందతో నిరసన.. వీడియో ఇదిగో! # ఎంపీ అవినాశ్‌ రెడ్డి ముఖ్య అనుచరులపై పోలీసు కేసు # లీడ్స్‌లో భారత్, ఇంగ్లండ్ తొలి టెస్ట్ మ్యాచ్‌కు వర్షం ముప్పు! # రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపిన మోదీ # భారత్ మా ఎయిర్‌బేస్‌పై దాడి చేసింది.. అంగీకరించిన పాకిస్థాన్ ఉప ప్రధాని # ఇంగ్లాండ్ గడ్డపై యువ భారత్ సత్తా చాటుతుంది: సచిన్ జోస్యం # బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో మంత్రి లోకేశ్‌ భేటీ # ఓటర్ కార్డు ఇక 15 రోజుల్లోనే: ఎన్నికల సంఘం కీలక నిర్ణయం # అణచివేత అనే పదానికి నిర్వచనంగా చంద్రబాబు: జగన్ # అక్టోబరు 2 నాటికి ఏపీలో ప్లాస్టిక్ రహిత నగరాలు: సీఎం చంద్రబాబు # కారు నుంచి దిగమని కోరినందుకు.. పెట్రోల్ పంప్ ఉద్యోగికి తుపాకీ గురిపెట్టిన యువతి # రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త! # జనాలను పెట్టి కోడిగుడ్లు, టమాటాలు వేయించాలనుకోవడం దారుణం: అంబటి రాంబాబు # బెంగళూరులో ప్రయాణికురాలిపై చేయి చేసుకున్న బైక్ ట్యాక్సీ రైడర్.. ఇదిగో వీడియో # కాల్స్ చేసుకోలేక, ఇంటర్నెట్ లేక... జియో యూజర్ల ఇబ్బందులు! # విమానం కాలిపోతుండగా ఫోన్‌తో బయటకు.. ప్రాణాలతో బయటపడ్డ విశ్వాస్ కుమార్ మరో వీడియో వైరల్! # రేవంత్ రెడ్డిని కేటీఆర్ రెచ్చగొడుతున్నారు: సీతక్క # రాత్రిపూట ఈ లక్షణాలున్నాయా? కాలేయ సమస్య కావచ్చు!

Kolkata Horror: మమత అబద్ధం చెబుతున్నారు.. మాకు డబ్బు ఆశ చూపారు.. కోల్‌కతా వైద్యురాలి తల్లిదండ్రులు

Date : 10 September 2024 12:47 PM Views : 123

Studio18 News - జాతీయం / : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై కోల్‌కతా ట్రైనీ వైద్యురాలి తల్లి సంచలన ఆరోపణలు చేశారు. మమత అబద్ధం ఆడుతున్నారని, తమకు పరిహారం ఇవ్వజూపారన్నది వాస్తవమని పేర్కొన్నారు. బాధిత వైద్యురాలి తల్లిదండ్రులకు పోలీసులు లంచం ఇవ్వబోయారన్న ఆరోపణలను ఖండించిన మమత.. తమ ప్రభుత్వాన్ని అపవాదుపాలు చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మమత వ్యాఖ్యలపై తాజాగా స్పందించిన బాధిత వైద్యురాలి తల్లి మాట్లాడుతూ.. ‘‘ముఖ్యమంత్రి అబద్ధం చెబుతున్నారు. మీకు పరిహారం అందుతుందని మాతో చెప్పారు. మీ కుమార్తె జ్ఞాపకార్థం ఏదైనా నిర్మించుకోవచ్చని అన్నారు. మా కుమార్తెకు న్యాయం జరిగినప్పుడు, నేనే మీ కార్యాలయానికి వచ్చి పరిహారం తీసుకుంటానని చెప్పాను’’ అని పేర్కొన్నారు. అంతేకాదు, అత్యాచారం, హత్యకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలను అణచివేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఆందోళనలు విరమించి రానున్న దుర్గా పూజలకు సిద్ధం కావాలంటూ మమత ఇచ్చిన పిలుపును అమానవీయంగా ఆమె అభివర్ణించారు. ఓ బిడ్డను కోల్పోయిన తల్లిగా తనకు ఆ పిలుపు అమానవీయంగానే కనబడిందని, దేశవ్యాప్తంగా ప్రజలు దుర్గాపూజ చేసుకోవాలంటే చేసుకోవచ్చని పేర్కొన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :