Studio18 News - జాతీయం / : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జమ్మూకశ్మీర్ ప్రజలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా గుడ్ న్యూస్ చెప్పారు. ఏప్రిల్ 1 నుంచి ప్రభుత్వ రంగ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని అందించనున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమం ద్వారా మహిళలకు ప్రయాణ ఖర్చు తగ్గడమే కాకుండా, వారి దైనందిన జీవితానికి సౌలభ్యం కలుగుతుందని ఒమర్ అబ్దుల్లా తెలిపారు. మహిళలకు మరింత స్వేచ్ఛ, అవకాశాలను అందించనుందని చెప్పారు. ముఖ్యమంత్రి ప్రకటన పట్ల జమ్మూకశ్మీర్ మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం జమ్మూకశ్మీర్ లో మహిళల సంఖ్య 59 లక్షలు. గడిచిన 14 ఏళ్లలో ఈ సంఖ్య మరింత పెరిగింది. రాష్ట్రంలో మహిళలు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నారని లెక్కలు చెబుతున్నాయి. విద్య, ఉద్యోగాల కోసం మహిళలు ఎక్కువగా ప్రయాణిస్తున్నారని అధికారులు వెల్లడించారు.
Admin
Studio18 News