Sunday, 08 March 2026 03:38:30 PM
# మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన

పన్నెండేళ్ల బాలుడి ప్రాణం తీసిన చిప్స్ పాకెట్.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ లెటర్

Date : 23 May 2025 02:08 PM Views : 336

Studio18 News - జాతీయం / : పశ్చిమ బెంగాల్‌లోని పశ్చిమ మేదినీపూర్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. చిప్స్ ప్యాకెట్ దొంగిలించాడని ఆరోపిస్తూ షాపు యజమాని ఓ పన్నెండేళ్ల బాలుడిపై చేయిచేసుకున్నాడు. అందరి ముందూ గుంజీలు తీయించాడు. విషయం తెలిసి అక్కడికి చేరుకున్న తల్లి కూడా కొట్టడంతో బాలుడు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఇంటికి వెళ్లగానే తన గదిలోకి వెళ్లి పురుగుల మందు తాగాడు. తలుపులు బద్దలు కొట్టి బాలుడిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ‘నేను దొంగను కాదు’ అంటూ బాలుడు రాసిన ఆత్మహత్య లేఖ చూసి స్థానికులు కంటతడి పెడుతున్నారు. ఈ హృదయ విదారక ఘటన గురువారం సాయంత్రం పాన్‌స్కురా ప్రాంతంలోని గోసాయిబేర్ బజార్‌లో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఏడో తరగతి చదువుతున్న క్రిషెందు దాస్ అనే విద్యార్థి చిప్స్ ప్యాకెట్ కొనేందుకు స్థానికంగా ఉన్న దుకాణానికి వెళ్లాడు. ఆ సమయంలో దుకాణ యజమాని శుభంకర్ దీక్షిత్ అక్కడ లేడు. "అంకుల్, చిప్స్ తీసుకుంటున్నా" అని క్రిషెందు చాలాసార్లు పిలిచినా ఎవరూ సమాధానం ఇవ్వలేదని, దాంతో బాలుడు చిప్స్ ప్యాకెట్‌తో అక్కడి నుంచి వెళ్లిపోయాడని మృతుడి తల్లి కన్నీటిపర్యంతమవుతూ పోలీసులకు తెలిపింది. కొద్దిసేపటికే దుకాణానికి తిరిగొచ్చిన యజమాని దీక్షిత్ బాలుడిని వెంబడించి పట్టుకున్నాడు. అందరి ముందూ క్రిషెందును చెంపదెబ్బ కొట్టి, గుంజీలు తీయించాడు. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న బాలుడి తల్లి కూడా అతన్ని మందలించి, కొట్టింది. తాను దుకాణం ముందు పడి ఉన్న కుర్‌కురే ప్యాకెట్‌ను మాత్రమే తీసుకున్నానని, తర్వాత డబ్బులు చెల్లిద్దామనుకున్నానని బాలుడు చెప్పాడు. వెంటనే డబ్బులు చెల్లిస్తానని, క్షమించమని వేడుకున్నా దుకాణదారు నమ్మలేదు, అబద్ధం చెబుతున్నావని నిందించాడు. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి, అవమానానికి గురైన క్రిషెందు, తల్లితో కలిసి ఇంటికి వెళ్ళాడు. తన గదిలోకి వెళ్లి తలుపు గడియ పెట్టుకున్నాడు. ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన తల్లి, స్థానికుల సహాయంతో తలుపులు పగలగొట్టి చూడగా, క్రిషెందు నోటి నుంచి నురగలు వస్తూ అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. అతని పక్కనే సగం ఖాళీ అయిన పురుగుల మందు డబ్బా, అతను బెంగాలీలో రాసిన ఓ లేఖ కనిపించాయి. "అమ్మా, నేను దొంగను కాదు. నేను ఏమీ దొంగిలించలేదు. నేను వెళ్లినప్పుడు అంకుల్ (దుకాణదారు) అక్కడ లేడు. తిరిగి వస్తుంటే రోడ్డుపై కుర్‌కురే ప్యాకెట్ కనిపిస్తే తీసుకున్నా. నాకు కుర్‌కురే అంటే చాలా ఇష్టం. ఇవే నా చివరి మాటలు. నన్ను క్షమించు" అని ఆ లేఖలో రాసి ఉంది. క్రిషెందును హుటాహుటిన తమ్లూక్ ఆసుపత్రికి తరలించి ఐసీయూలో చేర్పించారు. అయితే, చికిత్స పొందుతూ కొద్దిసేపటికే బాలుడు మరణించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత దుకాణ యజమాని పరారయ్యాడు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :