Tuesday, 31 March 2026 04:36:56 PM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

YS Sharmila: చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే: షర్మిల

Date : 07 February 2026 07:34 PM Views : 149

Studio18 News - ANDHRA PRADESH / AMARAVATI : ఐదేళ్లు నిద్రపోయి ఇప్పుడు వైసీపీ ఉద్యమాలు చేయడమేంటని షర్మిల ప్రశ్న సంగమేశ్వరం బదులు ముచ్చుమర్రి వద్ద ప్రాజెక్టు కట్టడంపై అభ్యంతరం స్వప్రయోజనాల కోసం సీమ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపణ ముఖ్యమంత్రి చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులేనని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విమర్శించారు. స్వప్రయోజనాల కోసం సీమ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఇద్దరూ నాటకాలు ఆడారని ఆమె ఆరోపించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో ఇరువురు నేతల వైఖరిని ఆమె తప్పుబట్టారు. వైసీపీ ప్రభుత్వంపై షర్మిల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. "గత ఐదేళ్ల పాలనలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అంశంలో నిద్రపోయిన వైసీపీ, ఇప్పుడు ఓటమి తర్వాత ఉద్యమాలు చేయడం సిగ్గుచేటు" అని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఎన్జీటీ వద్ద బలమైన వాదనలు వినిపించకుండా, కేంద్రం నుంచి అనుమతులు తీసుకురాకుండా ఇప్పుడు ఆందోళనలు ఎందుకని ప్రశ్నించారు. "ఐదేళ్లు ప్రధాని మోదీకి దత్తపుత్రుడిగా ఉన్న జగన్‌కు అప్పుడు సీమకు నీళ్లివ్వాలని గుర్తుకురాలేదా?" అని నిలదీశారు. జలయజ్ఞం ప్రాజెక్టులను 6 నెలల్లో పూర్తి చేస్తామని మ్యానిఫెస్టోలో పెట్టి, సీమ ప్రాజెక్టుల వైపు కన్నెత్తి కూడా చూడలేదని ఆమె విమర్శించారు. మరోవైపు, ముఖ్యమంత్రి చంద్రబాబు సంగమేశ్వరం వద్ద కాకుండా ముచ్చుమర్రి వద్ద ప్రాజెక్టు కడతామని చెప్పడాన్ని కూడా షర్మిల తప్పుబట్టారు. "ఎవరిని మోసం చేయడానికి ఇద్దరూ కలిసి ఈ నాటకాలు ఆడుతున్నారు? మోదీ దగ్గర సాగిలపడి సీమకు అన్యాయం చేస్తారా?" అని ఆమె తీవ్రంగా ప్రశ్నించారు. ఇద్దరు నేతలు తమ వైఖరిని మార్చుకోవాలని, సీమ ప్రయోజనాలను కాపాడాలని ఆమె డిమాండ్ చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :