Thursday, 12 March 2026 12:50:59 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Cash theft: టిఫిన్ చేసి తిరిగొచ్చేసరికి బైక్ లోని రూ.2 లక్షలు మాయం.. పశ్చిమ గోదావరి జిల్లాలో చోరీ

Date : 12 November 2025 06:53 PM Views : 102

Studio18 News - ANDHRA PRADESH / West Godavari : బ్యాంకులో డబ్బు డ్రా చేసి ఇంటికి వెళుతూ మధ్యలో హోటల్ దగ్గర ఆగిన యువకుడు బ్యాంకు దగ్గరి నుంచి ఫాలో అయిన దొంగ సీసీటీవీ ఫుటేజీలో చోరీ ఘటన రికార్డు బ్యాంకులో డ్రా చేసిన డబ్బును బైక్ కవర్ లో పెట్టి తీసుకెళుతున్న యువకుడు మధ్యలో ఓ హోటల్ వద్ద ఆగాడు. లోపలికి వెళ్లి టిఫిన్ చేసి తిరిగొచ్చేసరికి బైక్ లోని డబ్బును దొంగలు ఎత్తుకెళ్లారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురంలో చోటుచేసుకుందీ ఘటన. వివరాల్లోకి వెళితే.. నరసాపురం మండలం వేములదీవి గ్రామానికి చెందిన ఉంగరాల శ్రీను అనే యువకుడు ఎస్ బీఐ బ్యాంకులో రూ.2 లక్షలు డ్రా చేశాడు. ఆ డబ్బును బైక్ కవర్ లో పెట్టి బయలుదేరాడు. మార్గమధ్యంలో టిఫిన్ చేసేందుకు ఓ హోటల్ వద్ద ఆగాడు. బైక్ ను పార్క్ చేసి లోపలికి వెళ్లాడు. టిఫిన్ చేసి తిరిగొచ్చేసరికి బైక్ లో పెట్టిన 2 లక్షలు కనిపించలేదు. దీంతో వెంటనే హోటల్ ముందున్న సీసీటీవీ కెమెరా ఫుటేజీ పరిశీలించగా.. ఓ యువకుడు డబ్బు తీసుకెళ్లడం కనిపించింది. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా, శ్రీనివాస్ బ్యాంకులో పెద్ద మొత్తంలో డబ్బు విత్ డ్రా చేయడం గమనించిన దొంగ.. అక్కడి నుంచే శ్రీనివాస్ బైక్ ను ఫాలో అయ్యాడని, హోటల్ దగ్గర అవకాశం చిక్కడంతో చోరీ చేసి పారిపోయాడని పోలీసులు చెప్పారు. పెద్ద మొత్తంలో డబ్బును తీసుకెళ్లేటపుడు, బ్యాంకులో డబ్బు డ్రా చేసి తీసుకెళ్లేటపుడు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :