Friday, 13 December 2024 09:06:44 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

ఎమ్మెల్యే యార్లగడ్డ తీరుతో గన్నవరం టీడీపీలో టెన్షన్‌..! అసలేం జరిగిందంటే..

Date : 27 September 2024 11:48 AM Views : 30

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : Gossip Garage : ఆ నియోజకవర్గం ఏపీలో మోస్ట్‌ పాపులర్‌. ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేకు టీడీపీలో ఇంకెంతో క్రేజ్‌… అధినేత, యువనేత స్పెషల్‌ ఫోకస్‌ చేసి మరీ అక్కడి ఎమ్మెల్యేని గెలిపించారు. తమకు ఎదురుతిరిగిన మాజీ ఎమ్మెల్యేను అధః పాతాళంలోకి తొక్కేసి.. ఏరికోరి తెచ్చుకున్న నేతను అందలం ఎక్కించారు. ఇక ఎన్నికల తర్వాత అంతే ప్రాధాన్యం ఇస్తున్నారు. మరి పార్టీ అగ్రనాయకత్వం వద్ద అంత గుర్తింపు ఉన్న ఆ ఎమ్మెల్యే.. సొంత నియోజకవర్గంలో సొంత పార్టీ నేతతో గొడవపడుతున్నారు.. ఎమ్మెల్యే వర్సెస్‌ కృష్ణా మిల్క్‌ యూనియన్‌ అధ్యక్షుడి మధ్య వార్‌ టీడీపీలో హై అలర్ట్‌ ప్రకటించిందట.. ఇంతకీ ఆ ఇద్దరి గొడవేంటి? టీడీపీ అడ్డా గన్నవరం.. గన్నవరం.. ఏపీలో రాజకీయంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న నియోజకవర్గం. ముఖ్యంగా అధికార టీడీపీకి గన్నవరం అడ్డా… 2019 ఎన్నికల్లో ఫ్యాన్‌ స్పీడ్‌లోనూ గన్నవరంలో సైకిల్‌ జెండా రెపరెపలాడింది. ఇక ఆ ఎన్నికల తర్వాత అప్పటి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీరుతో టీడీపీ అగ్రనేతలు ఎంతో నొచ్చుకున్నారు. ఈ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే వల్లభనేనికి చుక్కలు చూపించేలా స్కెచ్‌ వేసి ప్రస్తుత ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావును గెలిపించారు సీఎం చంద్రబాబు. గతంలో వైసీపీలో పనిచేసిన యార్లగడ్డ… 2019లో స్వల్ప ఓట్లతో ఓడిపోయారు. కానీ, ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీ తెచ్చుకున్నారు. దీనికి కారణం టీడీపీ పెద్దల ప్రత్యేక దృష్టిపెట్టడం ఒకటైతే… వంశీపై అవిశ్రాంతంగా యార్లగడ్డ పోరాటం కూడా అని చెబుతుంటారు. కృష్ణ మిల్క్‌ యూనియన్‌ అధ్యక్షుడిపై యార్లగడ్డ ఫైర్.. ఏదిఏమైనా ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎమ్మెల్యే వెంకటరావు… వంద రోజులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు, హెచ్‌ఆర్‌డీ మంత్రి లోకేశ్‌ వద్ద ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రభుత్వ పరంగా గన్నవరం నియోజకవర్గానికి ప్రత్యేక కేటాయింపులు జరుగుతున్నాయి. ఇలా అంతా బాగుందనుకుంటున్న సమయంలో ఎమ్మెల్యే యార్లగడ్డ… టీడీపీకే చెందిన కృష్ణ మిల్క్‌ యూనియన్‌ అధ్యక్షుడు చలసాని ఆంజనేయులపై ఫైర్‌ అవ్వడం పార్టీలో హాట్‌ టాపిక్‌గా మారింది. చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడిగా ఆంజనేయులుకు గుర్తింపు.. ప్రస్తుతం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు, కృష్ణ మిల్క్‌ యూనియన్‌ అధ్యక్షుడు చలసాని ఆంజనేయులు మధ్య మాటల యుద్ధం కాకపుట్టిస్తోంది. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్న చలసాని ఆంజనేయులు గత ఎన్నికల్లో తనకు సహకరించలేదని… వైసీపీ నేతలతో రాజీపడ్డారని ఆరోపిస్తున్నారు యార్లగడ్డ. ఇదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకి చలసాని ఆంజనేయులు అత్యంత సన్నిహితుడిగా చెబుతున్నారు. గత ప్రభుత్వంలో సహకార డెయిరీలను నిర్వీర్యం చేసేలా అప్పటి పెద్దలు పాచికలు వేసినా, ఆంజనేయులు సామర్థ్యంతో విజయ డెయిరీని కాపాడుకున్నారని అంటుంటారు. సీఎం చంద్రబాబు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారని టీడీపీలో ప్రచారం. కానీ, సరిగ్గా ఇదే వ్యవహారంపై ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు ఆరోపణలు చేస్తుండటం రాజకీయంగా వేడి పుట్టిస్తోంది. సీఎం చంద్రబాబు సన్నిహితులపై ఆరోపణలు.. గత ఎన్నికల్లో తనకు మద్దతుగా ప్రచారం చేయలేదని ఆరోపిస్తుండటమే కాకుండా… వైసీపీ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, తనకు వ్యతిరేకంగా వార్తలు రాయించారని తీవ్ర విమర్శలు చేస్తూ అగ్గి రాజేస్తున్నారు వెంకటరావు. అలా అని ఒక్క చలసానిపై మాత్రమే కాకుండా… ప్రస్తుతం విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మెహన్‌పైనా బాణాలు ఎక్కుపెడుతున్నారు వెంకటరావు. గతంలో గన్నవరం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన గద్దె రామ్మోహన్‌… తనకు తెలియకుండా తన నియోజకవర్గ వ్యవహారాల్లో తలదూర్చుతున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు ఎమ్మెల్యే యార్లగడ్డ. మరోవైపు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ కూడా ముఖ్యమంత్రికి సన్నిహితుడే కావడంతో ఈ విషయంలో ఎవరికి సర్దిచెప్పాలో తెలియక టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా రియాక్ట్‌ అయ్యే మనస్తత్వం.. ఎమ్మెల్యే యార్లగడ్డ తొలిసారిగా గెలిచారు. మిగిలినే నేతలతో పోల్చితే రాజకీయంగా జూనియర్‌. కానీ, ఆ నేతలకు మించి సీఎం చంద్రబాబు వద్ద యార్లగడ్డకు ప్రాధాన్యం ఉందని చెబుతున్నారు. అయితే యార్లగడ్డ విమర్శలు ఎదుర్కొంటున్న నేతలు కూడా సీఎంతో నేరుగా మాట్లాడేంత చనువు ఉన్న వారు కావడంతో ఈ వివాదం ఎటు దారితీస్తుందోనన్న టెన్షన్‌ టీడీపీలో కనిపిస్తోందని చెబుతున్నారు. ఎమ్మెల్యే ముక్కుసూటి వ్యవహారం.. ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా రియాక్ట్‌ అయ్యే మనస్తత్వం వల్లే ప్రతిదీ వివాదాస్పదమవుతుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తనకు నచ్చినట్లు అంతా నడుచుకోవాలనని కోరుకోవడం కూడా గన్నవరం టీడీపీలో ఇబ్బందికరంగా మారిందని అంటున్నారు. సర్దుకుపోవాలని సీనియర్లకు చంద్రబాబు సూచనలు..! ఇటు సీనియర్‌ నేతలు, అటు సిట్టింగ్‌ ఎమ్మెల్యే మధ్య వివాదం సీఎం చంద్రబాబు దృష్టికి కూడా వెళ్లిందని చెబుతున్నారు. ఐతే ఎవరికి ఎలా సర్ది చెప్పాలనే విషయమై సీఎం కూడా తర్జనభర్జన పడుతున్నట్లు చెబుతున్నారు. 30 ఏళ్లుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న చలసాని ఆంజనేయులు, ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేసి పార్టీ ప్రతిష్టను పెంచే సీనియర్‌ ఎమ్మెల్యే గద్దె… ఈ ఇద్దరికీ మించి అన్నట్లు తన ప్రతిష్టను పెంచేలా గెలిచిన యార్లగడ్డ మధ్య సీఎం కూడా నలిగిపోతున్నట్లు చెబుతున్నారు. యార్లగడ్డ మనస్తత్వం తెలిసిన అధినేత… వెంటనే పిలిచి చెబితే నొచ్చుకుంటారనే ఆలోచనతో వేచిచూద్దామని నిర్ణయించినట్లు తెలుస్తోంది. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన స్పీడ్‌లో యార్లగడ్డ ఉన్నారని, మీరే సరిపెట్టుకోవాలని సీనియర్లకు చంద్రబాబు సూచనలు పంపినట్లు చెప్పుకుంటున్నారు. ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడాలని ఎమ్మెల్యేకు క్లాస్‌? తాజా వివాదంతో గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే యార్లగడ్డ మాటే చెల్లుబాటయ్యేలా చూడాలని సీఎం ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే స్వపక్షీయుల విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడాలని ఎమ్మెల్యేకు క్లాస్‌ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. గన్నవరం నియోజకవర్గం పార్టీకి ప్రతిష్ఠాత్మక స్థానం కావడం వల్ల విభేదాలకు చోటివ్వద్దని అందరికీ అధినేత వార్నింగ్‌ ఇచ్చారంటున్నారు. మొత్తానికి గన్నవరంలో గడబిడ రాజకీయం టీడీపీ నేతలకు ఒక్కసారి షాక్‌కు గురిచేసిందని అంటున్నారు. అధిష్టానం జోక్యంతో టీ కప్పులో తుఫాన్‌లా వెంటనే సర్దుమణిగింది. ఐతే ఎప్పుడైనా తుఫాన్‌ తీవ్రరూపం దాల్చే ఉందనే ప్రమాద హెచ్చరికలు మాత్రం ఇప్పట్లో ఉపసంహకరించుకునే పరిస్థితే కనిపించడం లేదంటున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు