Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని బీజేపీ ఏపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేశ్ నాయుడు విమర్శించారు. టీటీడీ ఈవోగా ధర్మారెడ్డి ఉన్నప్పుడే తిరుమల ప్రసాదంలో కల్తీ నెయ్యిని వాడారని మండిపడ్డారు. కల్తీ నెయ్యిని సరఫరా చేసిన సంస్థలను బ్లాక్ లిస్ట్ లో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. నెయ్యి సరఫరాకు ఆల్ఫా అనే సంస్థకు కాంట్రాక్టు ఎందుకిచ్చారని రమేశ్ నాయుడు ప్రశ్నించారు. ప్రసాదం తయారీలో అనుసరించిన తప్పుడు విధానాల వెనుక అంతర్జాతీయ క్రైస్తవుల హస్తం ఉందనే అనుమానం కలుగుతోందని అన్నారు. తన భార్య భారతితో కలిసి జగన్ ఏనాడూ తిరుమల శ్రీవారిని దర్శించుకోలేదని విమర్శించారు. హిందువుల మనోభావాలతో ఆడుకుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. రాష్ట్రంలో ఎన్డీయే పాలన వచ్చిన తర్వాత పాలన పాదర్శకంగా జరుగుతోందని చెప్పారు. ఏపీని అభివృద్ధిపథంలోకి తీసుకెళ్తామని... రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలుపుతామని అన్నారు.
Admin
Studio18 News