Thursday, 12 March 2026 12:34:26 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Tilak Varma: తిలక్ వర్మ త్వరగా కోలుకోవాలి: మంత్రి నారా లోకేశ్

Date : 08 January 2026 06:13 PM Views : 77

Studio18 News - ANDHRA PRADESH / AMARAVATI : టీమిండియా బ్యాటర్ తిలక్ వర్మకు అత్యవసర శస్త్రచికిత్స త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన మంత్రి నారా లోకేశ్ న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు తిలక్ వర్మ దూరం ప్రపంచకప్‌లోనూ ఆడటంపైనా నెలకొన్న సందేహాలు టీమిండియా యువ క్రికెటర్, తెలుగు తేజం తిలక్ వర్మ త్వరగా కోలుకోవాలని ఏపీ మంత్రి నారా లోకేశ్ ఆకాంక్షించారు. తిలక్ వర్మకు అత్యవసర శస్త్రచికిత్స జరిగిన నేపథ్యంలో లోకేశ్ స్పందించారు. "తిలక్ వర్మ త్వరగా, సంపూర్ణంగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. కఠిన సమయాలే నిజమైన ఛాంపియన్లను పరీక్షిస్తాయి. నువ్వు మునుపటి కంటే మరింత బలంగా తిరిగి వస్తావన్న నమ్మకం నాకుంది" అని లోకేశ్ పేర్కొన్నారు. విజయ్ హజారే ట్రోఫీ కోసం రాజ్‌కోట్‌లో ఉన్న తిలక్ వర్మకు బుధవారం ఉదయం తీవ్రమైన కడుపునొప్పి రావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. స్కానింగ్ అనంతరం వైద్యులు అత్యవసరంగా ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) వైద్య బృందంతో సంప్రదింపులు జరిపిన తర్వాత శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. ఈ శస్త్రచికిత్స కారణంగా తిలక్ వర్మ, న్యూజిలాండ్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు పూర్తిగా దూరం కానున్నాడు. అంతేకాకుండా, ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌లోనూ అతను ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. ఈ పరిణామం క్రీడాభిమానులను ఆందోళనకు గురిచేసింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :