Thursday, 12 March 2026 12:51:29 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Nara Lokesh: ఢిల్లీ చేరుకున్న నారా లోకేశ్... రేపు కేంద్రమంత్రులతో వరుస సమావేశాలు

Date : 03 February 2026 07:23 PM Views : 45

Studio18 News - ANDHRA PRADESH / AMARAVATI : రాష్ట్ర అభివృద్ధి, నిధుల సమీకరణే ప్రధాన అజెండా అమరావతి, విభజన హామీలపై చర్చించే అవకాశం ఐటీ, విద్యా రంగాల విస్తరణపై ప్రత్యేక దృష్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ ఢిల్లీ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు టీడీపీ ఎంపీలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ ఎంపీలతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. కాగా, రాష్ట్రానికి సంబంధించిన కీలక అభివృద్ధి పనులపై చర్చించేందుకు, నిధులు రాబట్టేందుకు లోకేశ్ రేపు (ఫిబ్రవరి 4) కేంద్ర మంత్రులతో వరుసగా సమావేశం కానున్నారు. ఈ రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్న లోకేశ్, బుధవారం పార్లమెంట్ భవనంలో పలువురు కేంద్ర మంత్రులతో కీలక భేటీలు జరపనున్నారు. ఈ పర్యటనలో ప్రధానంగా రాష్ట్రంలో ఐటీ రంగం విస్తరణ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల ఏర్పాటు, విద్యారంగ సంస్కరణలు వంటి అంశాలపై చర్చించనున్నారు. వీటితో పాటు ఏపీ విభజన చట్టంలోని హామీల అమలు, అమరావతి రాజధాని నిర్మాణానికి నిధులు, కొత్త ప్రాజెక్టుల మంజూరు వంటి విషయాలపై కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపనున్నారు. ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయించిన రాయితీలు, మౌలిక సదుపాయాల కల్పనపై సంబంధిత శాఖల మంత్రులతో లోకేశ్ చర్చించనున్నారు. అలాగే, రాష్ట్రంలో పురోగతిలో ఉన్న రూ.92,649 కోట్ల పనుల వివరాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై హై-స్పీడ్ రైల్వే కారిడార్ల అంశంపై కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో సమావేశమయ్యే అవకాశం కూడా ఉంది. కీలక సమావేశాల అనంతరం బుధవారం రాత్రికి ఆయన తిరిగి ఉండవల్లిలోని నివాసానికి చేరుకోనున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :