Studio18 News - ANDHRA PRADESH / : టీడీపీ నేత, మంత్రి అచ్చెన్నాయుడిపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డి టీడీపీలోకి వచ్చేందుకు ప్రయత్నించారంటూ అచ్చెన్న చేసిన వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ... "అచ్చెన్నాయుడూ! దేముడు నిన్ను పుట్టించేటప్పుడు మెదడు, బుద్ధి, జ్ఞానం 0.1% మాత్రమే ఇచ్చాడాయె! చిన్నప్పుడు మీ ఫ్రెండ్స్. అచ్చి.. బుచ్చి... కచ్చి... అని ఆట పట్టించేవారట కదా! దేహం పెరిగినట్టుగా మెదడు వృద్ధి చెందక పోవడం వల్ల మీ చేష్టలు, మాటలు అన్నీ వింతగా ఉంటాయి. మోకాలికి, బోడి గుండుకు లంకె పెడుతుంటావు. నా విధేయత, కమిట్మెంట్, నిబద్ధతలపై జోకులు పేలుస్తున్నావు. విజయసాయిరెడ్డి అనే నేను టీడీపీ అనే కులపార్టీలో చేరేందుకు ప్రయత్నించానా? అచ్చెన్నా... నువ్వు ఎంత గట్టిగా అనుకున్నా ఈ జన్మకి నీ కోరిక తీరదయ్యా! భ్రమల లోకంలో గెంతులేయాలనుకుంటే, గో...ఆన్... నిన్ను ఆపేదెవరు. జత ఎద్దులకుండే బలం ఉంది నీ ఒక్కడికి. మేథో శక్తికి, అడ్డం-నిలువుకు మధ్య ఉండే తేడా తెలియక పోవడం వల్లే మీతో ఈ సమస్యంతా" అని ట్వీట్ చేశారు.
Admin
Studio18 News