Thursday, 12 March 2026 01:05:52 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Chandrababu Naidu: అమరావతిలో కల్చరల్ సెంటర్... సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయం

Date : 22 December 2025 06:34 PM Views : 89

Studio18 News - ANDHRA PRADESH / AMARAVATI : అమరావతిలో కల్చరల్ సెంటర్ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు ఆదేశం జోన్-8 ఎల్పీఎస్ లేఅవుట్ అభివృద్ధికి రూ.1358 కోట్ల కేటాయింపు క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ నిర్మాణం గడువులోగా పూర్తి చేయాలని సూచన వివిధ అభివృద్ధి పనులకు 56వ సీఆర్డీఏ సమావేశంలో ఆమోదం రాజధాని రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశం రాజధాని అమరావతిలో రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఒక ఆధునిక కల్చరల్ సెంటర్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. దీని కోసం వెంటనే అనువైన భూమిని గుర్తించాలని సూచించారు. నేడు సచివాలయంలో జరిగిన 56వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఆయన అధ్యక్షత వహించి, పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా రాజధాని అభివృద్ధి పనులపై అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, "ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణకు అమరావతిలో ఒక వేదిక ఉండాలి. రాష్ట్ర సంస్కృతికి అద్దంపట్టేలా కల్చరల్ సెంటర్ నిర్మాణం చేపట్టాలి. నిర్దేశిత గడువులోగా క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ నిర్మాణం పూర్తి చేయాలి. భూములిచ్చిన రైతులకు కేటాయించిన ప్లాట్ల వద్ద పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించాలి. వారి సమస్యలను ఏమాత్రం జాప్యం చేయకుండా పరిష్కరించాలి," అని స్పష్టం చేశారు. రాజధాని ప్రాంతంలోని అటవీ ప్రాంతాలను అభివృద్ధి చేసి, పర్యాటకులను ఆకర్షించేలా పార్కులను ఏర్పాటు చేయాలని సూచించారు. 56వ సీఆర్డీఏ అథారిటీ ఆమోదించిన అంశాలు • అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ 2 ఎకరాల పరిధిలో రూ.103.96 కోట్లతో రీసెర్చ్ సెంటర్ • అఖిల భారత సర్వీసు అధికారుల భవనాలకు అదనపు సౌకర్యాల కల్పనకు రూ.109 కోట్ల కేటాయింపు. • శాఖమూరు గ్రామంలో 23 ఎకరాల్లో ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భవనాల నిర్మాణం. • హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు తుళ్లూరులో 6 ఎకరాలు కేటాయింపు. • 8400 క్యూసెక్కుల కెపాసిటీతో రూ.444 కోట్లతో ఫ్లడ్ పంపింగ్ స్టేషన్ ఏర్పాటు. • ఎల్పీఎస్ జోన్-8లో లే-అవుట్ల అభివృద్ధికి రూ.1358 కోట్లు కేటాయింపు. • 202 ఎకరాల భూమి జరీబు లేదా మెట్ట ప్రాంతమా అని నిర్దారణకు రాష్ట్రస్థాయి కమిటీ ఏర్పాటు. వ్యవసాయం, ఉద్యానవనం, భూగర్భ జలాలు, రెవెన్యూ, సర్వే విభాగాలకు చెందిన అధికారులతో కమిటీ ఏర్పాటు. ఈ సమావేశంలో మంత్రి నారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, సీఆర్డీఏ, ఏడీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :