Wednesday, 04 March 2026 08:45:58 AM
# Ambati Rambabu: అంబటి రాంబాబుకు రెండో షాక్... మరో కేసులో రిమాండ్ విధించిన కోర్టు # Jeffrey Epstein: ఎప్‌స్టీన్ మరణ ప్రకటనను అతడు చనిపోవడానికి ముందే రూపొందించారా? # Revanth Reddy: బీజేపీకి లైఫ్ లైన్ అసదుద్దీన్ ఒవైసీయే.. ఆయనే వారికి దేవుడు: రేవంత్ రెడ్డి # Chandrababu: క్షేత్రస్థాయిలో పర్యటించండి... విద్యార్థుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు: సీఎం చంద్రబాబు # Surekha Vani: అమ్మకు మళ్లీ పెళ్లి చేయాలి: సురేఖ వాణి కూతురు సుప్రీత # Chandrababu: ఉత్పత్తులకు బ్రాండింగ్, నాణ్యతే ముఖ్యం: సీఎం చంద్రబాబు # Revanth Reddy: మోదీ కచ్చితంగా బడాబాయే.. టీన్యూస్ జర్నలిస్టు ముఖంలో కేసీఆర్‌ను చూడలేను కదా: రేవంత్ రెడ్డి # Punjab: క్లాస్‌రూంలో దారుణం.. క్లాస్‌మేట్‌ను కాల్చి చంపి.. తనూ కాల్చుకున్న విద్యార్థి # Ram Gopal Varma: పిల్లలకు సోషల్ మీడియా నిషేధించాలనే డిమాండ్ పై ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు # Vijay Deverakonda: విజయ్ దేవరకొండ పెళ్లిపై మీడియా ప్రశ్న... స్పందించిన దర్శకుడు తరుణ్ భాస్కర్ # EPFO: పీఎఫ్ డబ్బులు ఇక యూపీఐతోనే.. ఏప్రిల్ నుంచి కొత్త సేవలు! # Prakash Raj: 'స్పిరిట్' నుంచి తొలగించారన్న వార్తలపై ప్రకాశ్‌ రాజ్‌ స్ట్రాంగ్ కౌంటర్‌ # Telangana Municipal Elections: తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం.. ఎల్లుండి పోలింగ్ # Ali Khamenei: 37 ఏళ్ల సంప్రదాయాన్ని పక్కన పెట్టిన ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ # AP News: 20 ఏళ్లు చిన్నవాడితో వివాహేత‌ర‌ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్యకు వివాహిత కుట్ర! # Chandrababu Naidu: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం # YS Sharmila: చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే: షర్మిల # Pakistan vs Netherlands: ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ థ్రిల్లింగ్ గెలుపు # Jairam Ramesh: భారత్, అమెరికా ట్రేడ్ డీల్... జైరామ్ రమేశ్ వ్యంగ్యం # KTR: ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్రిప్రమాదంపై కేటీఆర్ అనుమానాలు

Kamineni Srinivas Rao: ఇకపై పోటీ చేయను.. రాజకీయాల నుంచి తప్పుకుంటా: కామినేని శ్రీనివాసరావు

Date : 07 January 2026 07:24 PM Views : 98

Studio18 News - ANDHRA PRADESH / AMARAVATI : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనన్న కామినేని రాజకీయాల నుంచి తప్పుకోవాలని ఎప్పుడో ఆలోచించానని వెల్లడి రాజకీయాలకు అతీతంగా పని చేసి పేరు తెచ్చుకుంటానని వ్యాఖ్య ఏపీ బీజేపీ సీనియర్ నేత, కైకలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని ఆయన ప్రకటించారు. రాజకీయాల నుంచి తప్పుకోవాలని ఎప్పుడో అనుకున్నానని, కానీ అందరూ కోరుకోవడంతో పాటు బలవంతం చేయడంతోనే 2024 ఎన్నికల్లో పోటీ చేశానని ఆయన అన్నారు. అనూహ్యంగా ఎవరూ ఊహించని విధంగా భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు. తాను కానీ, తన కుటుంబంలో, ఎవరూ కానీ ఇకపై ఎన్నికల్లో పోటీ చేయబోమని కామినేని స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా మంచి పనులు చేసి, సమాజానికి ఉపయోగపడేలా పేరు తెచ్చుకుంటానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇదే సమయంలో... నియోజకవర్గంలో అక్రమాలు, అన్యాయాలు జరిగితే ఎవరినీ ఉపేక్షించబోమని కఠిన హెచ్చరిక కూడా చేశారు. ఎవరైనా తప్పు చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు, సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలకు కామినేని శ్రీనివాసరావు మంచి సందేశం ఇచ్చారు. పండుగలో జూదాలు ఆడటం మానేసి, మన సంప్రదాయ క్రీడలే ఆడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ‘జూదాలు వద్దు – సంప్రదాయ క్రీడలే ముద్దు’ అనే నినాదం కూడా ఇచ్చారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :