Tuesday, 03 December 2024 04:58:01 AM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

మరోసారి మీడియా ముందుకు బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. వైసీపీ నేత చెవిరెడ్డికి సవాల్

ఎవరి మెప్పుకోసమో సెకీ ఒప్పందంపై మాట్లాడలేదన్న మాజీ మంత్రి సీఎండీ దస్త్రం కూడా తన వద్దకు రాలేదని వెల్లడి వైసీపీ నుంచి ఎందుకు బయటకు వచ్చానో చర్చకు సిద్ధ

Date : 25 November 2024 01:58 PM Views : 58

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : సెకీతో సౌరవిద్యుత్‌ ఒప్పందం అంశంలో తనకు ఏమాత్రం సంబంధం లేదని ఏపీ విద్యుత్ శాఖ మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి పునరుద్ఘాటించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మెప్పుకోసమే తాను సెకీ ఒప్పందంపై మాట్లాడానని విమర్శిస్తున్నారని, ఎవరి మెప్పు కోసమో తాను పనిచేయడం లేదని గుర్తుపెట్టుకోవాలని బాలినేని అన్నారు. సెకీతో ఒప్పందానికి సంబంధించి సీఎండీ దస్త్రం కూడా తన వద్దకు రాలేదన్నారు. వైసీపీ నేత చెవిరెడ్డి భాష్కర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. తాను వ్యక్తిగత విమర్శలు చేస్తే ఎవరూ తట్టుకోలేరని, తాను వైసీపీ నుంచి ఎందుకు బయటకు వెళ్లాల్సి వచ్చిందో మొత్తం చెబుతానని, ధైర్యం ఉంటే చర్చకు రావాలని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఆయన సవాల్ చేశారు. రాజశేఖర్ రెడ్డి కుటుంబం వల్లే తాను పైకి వచ్చానంటూ మాట్లాడుతున్నారని, వైఎస్సే రాజకీయ భిక్ష పెట్టారని జనసేనలో చేరినప్పుడు తానే మీడియా ముఖంగా చెప్పానని బాలినేని శ్రీనివాస్ రెడ్డి ప్రస్తావించారు. ‘‘నేను విలువలు లేని రాజకీయాలు చేసే వ్యక్తిని కాదు. వైఎస్‌పై అభిమానంతోనే మంత్రి పదవి వదులుకొని జగన్ పార్టీలోకి వెళ్లా. రాజశేఖర్ రెడ్డి మరణించాక మంత్రి పదవి, ఎమ్మెల్యే పదవిని వదులుకున్నా. పవన్ వెంట ఉండి కూటమితో కలిసి పనిచేసేందుకు నేను సిద్దంగా ఉన్నాను’’ అని ఆయన స్పష్టం చేశారు. షర్మిల, విజయమ్మ వైఎస్ కుటుంబం కాదా? రాజశేఖర్ రెడ్డి కుటుంబం అంటే ఒక్క జగన్ మోహన్ రెడ్డేనా అని బాలినేని ప్రశ్నించారు. ‘‘షర్మిల, విజయమ్మ కాదా?. షర్మిల, విజయమ్మపై పోస్టులు పెడితే రాజశేఖర్ రెడ్డి కుటుంబం కానట్లు ఏమీ పట్టించుకోరా?’’ అని అన్నారు. ‘‘తిట్టేవాళ్లకే టికెట్లు ఇస్తామనే సంప్రదాయం ఎవరు కొనసాగిస్తున్నారో తెలుసు. చిత్తూరు జిల్లా అధ్యక్షుడిని తీసుకొచ్చి ఒంగోలులో టికెట్ ఇస్తారా?. ఒంగోలులో పోటీ చేసే నాయకుడే లేరని చిత్తూరు జిల్లా నుంచి తెచ్చారా?. చిత్తూరు జిల్లా నుంచి తీసుకొచ్చి నిలబెట్టడం నాకు నచ్చలేదు. అందుకే ఒప్పుకోలేదు’’ అని ఆయన అన్నారు. కాగా గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదయిన లంచం అభియోగాలకు సంబంధించి.. సెకీతో ఏపీ సౌరవిద్యుత్‌ ఒప్పందంపై ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై నాటి విద్యుత్‌శాఖ మంత్రి, ప్రస్తుతం జనసేనలో ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి ఇటీవలే మీడియా సమావేశం నిర్వహించారు. సెకీ ఒప్పందం వెనుక ఇంత మ‌త‌ల‌బు ఉందని ఆనాడు ఊహించలేదని సందేహం వ్యక్తం చేశారు. అప్పట్లో ఇంధనశాఖ కార్యదర్శిగా పనిచేసిన శ్రీకాంత్‌ ఒక రోజు అర్ధరాత్రి ఒంటిగంటకు ఫోన్‌ చేసి సెకీతో ఒప్పంద ప‌త్రాల‌పై సంతకం చేయమన్నారని, అనుమానం రావడంతో తాను చేయలేదని, ఆ తర్వాత కేబినెట్‌లో పెట్టి ఆమోదింపజేసుకున్నారని బాలినేని వెల్లడించారు.

Also Read : విమానంలో పాములు.. వణికిపోయిన ప్రయాణికులు!

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు