Studio18 News - ANDHRA PRADESH / : వైసీపీ కీలక నేత, కడప ఎంపీ అవినాశ్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. వైఎస్ఆర్ జిల్లా వేముల మండలం గొల్లల గూడూరు గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త ఈసీ మహేశ్వర్ రెడ్డి నీటి పన్ను చెల్లించేందుకు గురువారం తహసీల్దార్ ఆఫీస్‌కి వెళ్లారు. అయితే, అక్కడ ఆయనను కొందరు వ్యక్తులు అడ్డుకుని సంబంధిత పత్రాలను చించివేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఎంపీ అవినాశ్ రెడ్డి వేముల పీఎస్‌కి వెళ్లి ఎస్ఐతో మాట్లాడారు. ఆ సమయంలో అక్కడికి భారీగా వైసీపీ కార్యకర్తలు రావడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో గొడవ జరిగే అవకాశం ఉందని పోలీసులు ఎంపీ అవినాశ్ రెడ్డిని అదుపులోకి తీసుకుని తమ వాహనంలోనే పులివెందులలోని జగన్ క్యాంపు ఆఫీస్‌కి తరలించారు. అక్కడే సీఐ నరసింహులు ఆధ్వర్యంలో హౌస్ అరెస్ట్ చేశారు.
Also Read : అల్లు అర్జున్ అరెస్ట్ పై కేటీఆర్ స్పందన
Admin
Studio18 News