Thursday, 12 March 2026 12:25:43 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Aruna Nellore: నెల్లూరు లేడీ డాన్ అరుణకు రిమాండ్

Date : 01 November 2025 07:49 PM Views : 335

Studio18 News - ANDHRA PRADESH / AMARAVATI : లేడీ డాన్‌గా పేరున్న అరుణకు విజయవాడ కోర్టు రిమాండ్ ఉద్యోగాల పేరుతో రూ. 12 లక్షలు తీసుకుని మోసం చేసినట్టు ఆరోపణ డబ్బు తిరిగివ్వమని అడిగితే బెదిరింపులకు పాల్పడినట్టు బాధితుడి ఫిర్యాదు లేడీ డాన్‌గా పేరు పొందిన నెల్లూరుకు చెందిన అరుణకు విజయవాడ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఉద్యోగాల పేరుతో రూ. 12 లక్షలు తీసుకుని మోసం చేశారన్న ఆరోపణలపై నమోదైన కేసులో పోలీసులు ఆమెను కోర్టులో హాజరుపరిచారు. విచారణ జరిపిన న్యాయస్థానం నవంబరు 14 వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే, 2021లో రమేశ్ బాబు అనే వ్యక్తి తన బంధువులకు ఉద్యోగాలు ఇప్పించాలంటూ అరుణను సంప్రదించారు. ఇందుకు గాను ఆమెకు రూ. 12 లక్షల వరకు నగదు ముట్టజెప్పారు. అయితే, నెలలు గడుస్తున్నా ఉద్యోగాల విషయంలో ఎలాంటి పురోగతి కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చిన రమేశ్ బాబు.. అరుణను కలిసి తన డబ్బు తిరిగి ఇవ్వాలని నిలదీశారు. ఈ క్రమంలో అరుణ తనను నెల్లూరుకు పిలిపించి తీవ్రంగా బెదిరించారని, దాంతో భయపడి ఇన్నాళ్లూ ఫిర్యాదు చేయలేదని బాధితుడు తెలిపారు. ఇటీవల ధైర్యం చేసి విజయవాడ సూర్యారావుపేట పోలీసులను ఆశ్రయించి, తాను మోసపోయిన తీరును వివరిస్తూ ఫిర్యాదు చేశారు. రమేశ్ బాబు ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అరుణపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇప్పటికే మరో కేసులో నెల్లూరు కేంద్ర కారాగారంలో రిమాండులో ఉన్న అరుణను, పీటీ వారెంట్‌పై విజయవాడకు తీసుకొచ్చారు. స్థానిక కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం పోలీసులు నిందితురాలిని తిరిగి నెల్లూరు జైలుకు తరలించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :