Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : Ttd Laddu Row : తిరుమల కల్తీ నెయ్యి వివాదంలో సిట్ ఏర్పాటుపై జీవో విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ జీవోను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రిలీజ్ చేశారు. 9 మంది సభ్యులతో సిట్ ఏర్పాటు చేసింది సర్కార్. సిట్ చీఫ్ గా సర్వశ్రేష్ఠ త్రిపాఠిని నియమించింది. సత్యనారాయణ, గోపీనాథ్, వెంకట్రావు, సీతారామరాజు, ఉమామహేశ్వర్, హర్షవర్దన్ రాజులను సభ్యులుగా నియమించింది చంద్రబాబు సర్కార్. అలాగే సిట్ కు సహకరించాలని హోంశాఖ, దేవదాయశాఖ, టీటీడీ ఈవోకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారనే అంశం తీవ్ర దుమారం రేపుతోంది. దీన్ని సీరియస్ గా తీసుకున్న చంద్రబాబు సర్కార్.. ఈ వ్యవహారంపై విచారణకు ప్రత్యేక దర్యాఫ్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. 9 మంది సభ్యులతో (పోలీసు అధికారులు) సిట్ ను నియమించింది. ఈ విచారణ పూర్తి స్థాయిలో పారదర్శకంగా ఉండేలా.. దీనికి సంబంధించి ఏ శాఖ నుంచైనా ఎలాంటి సమాచారమైనా రాబట్టుకునే స్వేచ్చను సిట్ కు ఇచ్చింది ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు ఐజీగా ఉన్న సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆధ్వర్యంలో 9మంది సభ్యుల బృందం పని చేస్తుంది. ఒక ఐడీ, ఒక డీఐజీ, ఒక ఎస్పీ, ఒక అడినషల్ ఎస్పీ, ఇద్దరు డీఎస్పీలు, ముగ్గురు సీఐలతో కూడి బృందాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు ఇచ్చారు. సర్వశ్రేష్ఠ త్రిపాఠి గుంటూరు ఐజీగా ఉన్నారు. గోపీనాథ్ శెట్టి డీఐజీ, హర్షవర్దన్ రావు ఎస్పీ, వెంకట్రావు అడిషనల్ ఎస్పీ, సీతారామరాజు డీఎస్పీ, సత్యనారాయణ, ఉమామహేశ్వర్ రావు, సూర్యనారాయణ సీఐలుగా ఉన్నారు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా విచారణ పూర్తి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని చెప్పారు. ఈ క్షణం నుంచే సిట్ పని చేయడం స్టార్ట్ అవుతుంది. కల్తీ నెయ్యి వ్యవహారంపై పూర్తి విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే బాధ్యత సిట్ పై ఉంది.
Admin
Studio18 News