Saturday, 07 March 2026 08:48:19 PM
# అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన # కోడిమ్యాల మండలంలో కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటన – అభివృద్ధి పనుల పరిశీలన # ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై బీఆర్‌ఎస్ విమర్శలు # విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి # 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కార్మిక సమస్యలపై పోరాటానికి ఏఐటీయూసీ సిద్ధం # ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి: షబ్బీర్ అలీ # విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి: కలెక్టర్ రాజర్షి షా # రైతుబంధుపై సీఎం వ్యాఖ్యలు రైతుల అవమానం – క్షమాపణ చెప్పాలి: జోగు రామన్న # ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రారంభం

YS Sharmila: ప్రధాని మోదీపై షర్మిల తీవ్ర ఆరోపణలు

Date : 18 September 2025 07:16 PM Views : 153

Studio18 News - ANDHRA PRADESH / AMARAVATI : బీజేపీకి ఈసీ కీలుబొమ్మ అని షర్మిల మండిపాటు దేశవ్యాప్తంగా పథకం ప్రకారం ఓట్ల చోరీ జరిగిందని ఆరోపణ నకిలీ లాగిన్లతో ఓట్లు తొలగించడం ఉగ్రవాద చర్యతో సమానమని ఫైర్ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై, భారత ఎన్నికల సంఘం (ఈసీఐ)పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. దేశంలో పథకం ప్రకారం ఓట్ల చోరీ జరిగిందని, దీని వెనుక ప్రధాని మోదీ ఉన్నారని ఆమె తీవ్రస్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఓట్ల తొలగింపు వ్యవహారంపై ఆధారాలతో మాట్లాడుతుంటే, ప్రధాని మోదీ బండారం బయటపడుతోందని గురువారం ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ఎన్నికల సంఘం, బీజేపీకి కీలుబొమ్మగా మారిందని షర్మిల ఆరోపించారు. లక్షలాది మంది ఓటు హక్కును కాలరాస్తూ, బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. "ప్రధాని మోదీ కోసం అవసరమైన చోట దొంగ ఓట్లు సృష్టించడం, కాంగ్రెస్‌కు అనుకూలమైన చోట ఓట్లు తొలగించడం ద్వారా ఈసీ తన స్వయంప్రతిపత్తిని కోల్పోయింది" అని ఆమె పేర్కొన్నారు. కర్ణాటకలోని అలంద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుస్తుందనే ఉద్దేశంతోనే, నకిలీ లాగిన్ల ద్వారా సుమారు 6 వేల ఓట్లను తొలగించారని ఆమె ఆరోపించారు. సాఫ్ట్‌వేర్‌ను హైజాక్ చేసి, ఆటోమేటెడ్ ప్రోగ్రామింగ్ ద్వారా ఓట్లను తొలగించడం దేశద్రోహంతో సమానమని షర్మిల అభిప్రాయపడ్డారు. నకిలీ ధృవపత్రాలు, తప్పుడు ఫోన్ నంబర్లతో ఓట్లను అక్రమంగా తొలగించడాన్ని ఉగ్రవాద చర్యగా ఆమె అభివర్ణించారు. రాహుల్ గాంధీ డిమాండ్ చేసిన విధంగా, తొలగించిన ఓటర్ల పూర్తి వివరాలను, వాటికి ఉపయోగించిన ఫోన్ నంబర్లు, ఓటీపీల సమాచారాన్ని వారం రోజుల్లోగా బహిర్గతం చేయాలని ఆమె ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. అలా చేయని పక్షంలో, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న వారికి ఈసీనే స్వయంగా రక్షణ కల్పిస్తున్నట్లు భావించాల్సి ఉంటుందని షర్మిల హెచ్చరించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :