Sunday, 08 March 2026 10:09:05 PM
# భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు ఘన ఏర్పాట్లు # ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ మహిళా కార్మికులకు సన్మానం # అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభ నిర్వహణ # టీజీఎస్‌ఆర్టీసీ డిపోలలో మహిళా దినోత్సవ వేడుకలు # బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం # స్నేహానికి నిలువెత్తు నిదర్శనం… స్నేహితురాలికి రూ.70 వేల ఆర్థిక సహాయం # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులకు సన్మానం # వేములవాడ హత్య కేసును ఛేదించిన పోలీసులు # మహిళల సమాన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య

ఇచ్చిన మాట ప్ర‌కారం ఖాతాల్లో 'త‌ల్లికి వంద‌నం' డ‌బ్బులు ప‌డుతున్నాయి: టీడీపీ

Date : 13 June 2025 01:02 PM Views : 579

Studio18 News - ANDHRA PRADESH / : ఏపీలో సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూట‌మి ప్రభుత్వం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'తల్లికి వందనం' పథకాన్ని ప్రారంభించింది. నిన్న‌టి నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చింది. ఈ ప‌థ‌కం ద్వారా రాష్ట్రంలోని నిరుపేద కుటుంబాలలో విద్యను ప్రోత్సహించే లక్ష్యంతో, ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు చదువుతున్న ప్రతి బిడ్డకూ వారి తల్లులకు ఏటా ఆర్థిక సహాయం అందించనున్నారు. ఇందులో భాగంగా ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన త‌ల్లికి వంద‌నం నిధులు విద్యార్థుల త‌ల్లులు, సంర‌క్ష‌కుల ఖాతాల్లో జ‌మ అవుతున్నాయి. ఈ మేర‌కు సోష‌ల్ మీడియాలో టీడీపీ పోస్ట్ చేసింది. "చెప్పిన విధంగా... ఇచ్చిన మాట ప్ర‌కారం ఖాతాల్లో త‌ల్లికి వంద‌నం డ‌బ్బులు ప‌డుతున్నాయి" అని పార్టీ పేర్కొంది. ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్న ఓ ల‌బ్ధిదారు ఖాతాలో రూ. 26వేలు ప‌డ్డాయ‌ని పేర్కొంటూ బ్యాంకు నుంచి మెబైల్‌కు వ‌చ్చిన సందేశాన్ని టీడీపీ పోస్ట్ చేసింది. మ‌రో రూ. 4వేలు పాఠ‌శాల ఖాతాలో జ‌మ అయ్యాయ‌ని తెలిపింది. కాగా, నిన్న‌టి నుంచి అమ‌లు చేస్తున్న తల్లికి వంద‌నం ప‌థ‌కం కింద రాష్ట్ర‌వ్యాప్తంగా 35,44,459 త‌ల్లులు, సంర‌క్ష‌కుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జ‌మ చేయ‌నున్న‌ట్లు ఇప్ప‌టికే ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఒక్కో విద్యార్థికి రూ.15వేలు చొప్పున ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది. ఇందులో రూ.13వేలు ల‌బ్ధ‌దారుల బ్యాంకు ఖాతాల‌కు, మిగ‌తా రూ.2వేల‌ను ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల అభివృద్ధి కోసం క‌లెక్ట‌ర్ల ఖాతాల‌కు జ‌మ చేస్తారు. ఇక‌, గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'అమ్మ ఒడి' పథకానికి ఇది సవరించిన రూపం. అయితే, 'అమ్మ ఒడి'లో కుటుంబానికి ఒకరికి మాత్రమే పరిమితం కాగా, 'తల్లికి వందనం' కింద ప్రతి బిడ్డకూ ప్రయోజనం చేకూరనుంది. అర్హత పొందిన ప్రతి తల్లి ఖాతాలో డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) విధానంలో సంవత్సరానికి రూ. 15,000 జమ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ పథకం కోసం మొత్తం రూ. 8,745 కోట్లు కేటాయించినట్లు తెలిపింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :