Sunday, 08 March 2026 10:39:19 PM
# భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు ఘన ఏర్పాట్లు # ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ మహిళా కార్మికులకు సన్మానం # అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభ నిర్వహణ # టీజీఎస్‌ఆర్టీసీ డిపోలలో మహిళా దినోత్సవ వేడుకలు # బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం # స్నేహానికి నిలువెత్తు నిదర్శనం… స్నేహితురాలికి రూ.70 వేల ఆర్థిక సహాయం # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులకు సన్మానం # వేములవాడ హత్య కేసును ఛేదించిన పోలీసులు # మహిళల సమాన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య

Bhumana Karunakar Reddy: విగ్రహం వ్యాఖ్యల వివాదం: భూమనకు అలిపిరి పోలీసుల నోటీసులు

Date : 17 September 2025 06:41 PM Views : 157

Studio18 News - ANDHRA PRADESH / Tirupati : టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి 41ఏ నోటీసులు అలిపిరి విగ్రహంపై వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో కేసు భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని డిప్యూటీ ఈవో ఫిర్యాదు విచారణకు హాజరు కావాలంటూ పోలీసుల ఆదేశం వచ్చే మంగళవారం విచారణకు వస్తానని తెలిపిన భూమన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. తిరుపతిలోని అలిపిరి వద్ద ఒక విగ్రహం నిర్లక్ష్యానికి గురైందంటూ ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో నమోదైన కేసులో భాగంగా బుధవారం అలిపిరి పోలీసులు ఆయనకు 41ఏ నోటీసులు అందజేశారు. ఈ కేసు విచారణ నిమిత్తం గురువారం తిరుపతి డీఎస్పీ కార్యాలయంలో హాజరుకావాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే, తాను కొన్ని రోజుల పాటు వ్యక్తిగత పనుల కారణంగా బిజీగా ఉంటానని భూమన కరుణాకర్ రెడ్డి పోలీసులకు తెలియజేశారు. దీనిపై స్పందించిన ఎస్ఐ అజిత, వీలు చూసుకుని విచారణకు రావాలని సూచించారు. అనంతరం, వచ్చే మంగళవారం, అంటే సెప్టెంబర్ 23వ తేదీన విచారణకు హాజరవుతానని భూమన పోలీసులకు స్పష్టం చేసినట్లు సమాచారం. కొన్ని రోజుల క్రితం అలిపిరి సమీపంలోని ఒక విగ్రహం విషయంలో భూమన చేసిన వ్యాఖ్యలు శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంపై టీటీడీ డిప్యూటీ ఈవో గోవిందరాజు అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు భూమనపై కేసు నమోదు చేసి, తాజాగా నోటీసులు జారీ చేశారు. ఇదిలా ఉండగా, సోషల్ మీడియాలో టీటీడీపై జరుగుతున్న దుష్ప్రచారంపై సోమవారం జరిగిన పాలకమండలి సమావేశంలో చర్చించారు. టీటీడీ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సంస్థ చైర్మన్ బీఆర్ నాయుడు ఈ సందర్భంగా హెచ్చరించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :