Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : తిరుపతి ఆర్డీవో నిశాంత్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. పుత్తూరులో పెట్రోల్ బంక్ ఏర్పాటుకు ఒక వ్యక్తి నుండి తన క్యాంప్ క్లర్క్ ద్వారా లక్ష డిమాండ్ చేశారన్న ఆరోపణపై విచారణ జరిపిన ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిశాంత్ రెడ్డితో పాటు పుత్తూరు తహసీల్దార్‌గా పని చేసిన పరమేశ్వర స్వామి, కలెక్టరేట్ లోని సూపరింటెండెంట్ సురేశ్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్‌వోసీ జారీకి తన అల్లుడు శ్రీను నుండి లంచం తీసుకున్నారని పేర్కొంటూ అధికారులపై కేకే కిషోర్ కుమార్ అనే సాంకేతిక కన్సల్టెంట్ సీసీఎల్ఏకు ఫిర్యాదు చేయగా, విచారణ జరిపిన ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. తొలుత లక్ష రూపాయలు డిమాండ్ చేసిన ఆర్డీవో .. కలెక్టర్ సిఫార్సు చేసినందుకు 50 వేలు రాయితీ ఇస్తున్నామని చెప్పి క్యాంపు క్లర్క్ ద్వారా లంచం తీసుకున్నారని, భూ మార్పిడికి మరో రూ.30వేలు వసూలు చేశారని ఫిర్యాదుదారుడు పేర్కొన్నారు. తహసీల్దార్ పరమేశ్వర స్వామి రూ.20వేలు, కలెక్టరేట్ సూపరింటెండెంట్ రూ.20వేలు లంచం తీసుకున్నట్లు ఫిర్యాదులో కిషోర్ కుమార్ ఉటంకించారు.
Admin
Studio18 News