Thursday, 12 March 2026 01:20:09 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Jogi Ramesh: విజయవాడ జైలు నుంచి నెల్లూరు జైలుకు జోగి రమేశ్ తరలింపు

Date : 03 November 2025 06:24 PM Views : 277

Studio18 News - ANDHRA PRADESH / AMARAVATI : నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్‌కు రిమాండ్ ఆయన సోదరుడు రాముకు కూడా రిమాండ్ విధించిన న్యాయస్థానం ఈ నెల 13వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీకి ఆదేశం నకిలీ మద్యం కేసులో అరెస్టయిన మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్‌, ఆయన సోదరుడు రాముకు న్యాయస్థానం 10 రోజుల రిమాండ్ విధించింది. ఈ నెల 13వ తేదీ వరకు వారికి జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఈ తెల్లవారుజామున ఆదేశాలు జారీ చేశారు. కోర్టు ఆదేశాల మేరకు తొలుత విజయవాడ జైలుకు వారిని తరలించారు. అనంతరం నెల్లూరు జైలుకు మార్చారు. నిన్న ఉదయం ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నంలో జోగి రమేశ్‌ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం విజయవాడలోని తూర్పు ఎక్సైజ్‌శాఖ కార్యాలయానికి తరలించి సుమారు 12 గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న జనార్దనరావుతో ఉన్న సంబంధాలపై అధికారులు ఆరా తీశారు. రమేశ్‌తో పాటు ఆయన సోదరుడు రామును కూడా వేర్వేరుగా, కలిపి ప్రశ్నించి వివరాలు సేకరించారు. విచారణ అనంతరం వైద్య పరీక్షలు పూర్తి చేసి, సోదరులిద్దరినీ న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఇరుపక్షాల వాదనలు ప్రారంభమయ్యాయి. సుదీర్ఘ వాదనల అనంతరం సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు న్యాయమూర్తి తీర్పు వెలువరిస్తూ రిమాండ్‌కు ఆదేశించారు. దీంతో తొలుత వారిని విజయవాడ జిల్లా జైలుకు, అక్కడి నుంచి నెల్లూరు కేంద్ర కారాగారానికి తరలించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :