Thursday, 12 March 2026 01:00:56 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Chandrababu Naidu: నితీశ్ ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు, లోకేశ్... ఈ నెల 20న పాట్నాకు పయనం

Date : 18 November 2025 06:55 PM Views : 130

Studio18 News - ANDHRA PRADESH / : బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘనవిజయం ఎల్లుండి సీఎంగా నితీశ్ కుమార్ ప్రమాణస్వీకారం ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ లకు ఆహ్వానం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ బీహార్ పర్యటనకు వెళ్లనున్నారు. బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ అధినేత నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా వారికి ఆహ్వానం అందింది. ఈ మేరకు ఇరువురు నేతలు ఈ నెల 20వ తేదీన పాట్నాకు వెళ్లనున్నారు. ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి నారా లోకేశ్ ఎన్డీఏ కూటమి తరఫున ప్రచారంలో చురుగ్గా పాల్గొన్న విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో ఆయన రాష్ట్రంలో పర్యటించి, పలు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అంతేకాకుండా, తన పర్యటనలో భాగంగా పలువురు బీహార్ పారిశ్రామికవేత్తలతో సమావేశమై చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకావాలని వచ్చిన ఆహ్వానం మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ పాట్నా వెళ్లనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. 20వ తేదీన జరిగే ఈ కార్యక్రమంలో వారు పాల్గొని నితీశ్ కుమార్‌కు అభినందనలు తెలియజేయనున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :