Studio18 News - ANDHRA PRADESH / : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత ఈరోజు ఏపీ అసెంబ్లీకి వెళ్లారు. రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనితతో ఆమె భేటీ అయ్యారు. తన తండ్రి హత్య కేసు గురించి ఆమెతో చర్చించారు. ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి... జైలు అధికారులకు రాసిన లేఖపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని కోరారు. అనంతరం సీఎంఓ అధికారులను కూడా ఆమె కలిశారు. తన తండ్రి హత్య కేసులో పురోగతిపై వారితో చర్చించారు. కేసు పురోగతికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. తన తండ్రి హత్య కేసులో నిజమైన దోషులను శిక్షించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆమె కోరినట్టు తెలుస్తోంది.
Also Read : కథానాయిక కీర్తి సురేశ్ పెళ్లి ముహూర్తం కుదిరిందా?
Admin
Studio18 News