Thursday, 12 March 2026 03:12:11 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

ఆఫీస్ బాయ్‌ను చెప్పుతో కొట్టిన ఆబ్కారీ సీఐ

Date : 17 May 2025 11:22 AM Views : 463

Studio18 News - ANDHRA PRADESH / Anantpur : అనంతపురం జిల్లా కల్యాణదుర్గం ఆబ్కారీ సీఐ హసీనాబాను ఆఫీసుబాయ్‌ను చెప్పుతో కొట్టిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. "మ‌ద్యం అక్ర‌మంగా విక్ర‌యిస్తున్న వారి నుంచి నీవు డ‌బ్బులు వ‌సూలు చేసుకొని నాపై చెబుతావా... నాపై లేనిపోని ఆరోప‌ణ‌లు చేస్తావా" అంటూ ఆఫీస్ బాయ్‌ను సీఐ చెప్పుతో కొట్ట‌డం వీడియోలో ఉంది. ఈ వీడియో శుక్ర‌వారం ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. కల్యాణదుర్గం సర్కిల్ పరిధిలో కర్ణాటక మద్యం ఏరులై పారుతుండటం వెనక అధికారుల అక్రమ వసూళ్లే కారణమన్న ప్రచారం ఉంది. ఈ క్ర‌మంలో ఆబ్కారీ కార్యాలయం ప‌రిధిలో అక్ర‌మంగా మ‌ద్యం విక్ర‌యిస్తున్న వారి నుంచి సీఐ ప్ర‌తి నెలా డ‌బ్బులు వ‌సూలు చేస్తున్న‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇదే విష‌య‌మై ఆఫీస్ బాయ్ నాని ఆబ్కారీ అధికారుల‌కు ఫిర్యాదు చేసిన‌ట్లు స‌మాచారం. దీంతో ఇటీవ‌ల ఆబ్కారీ శాఖ ఉద్యోగుల సంఘం నాయ‌కులు సీఐతో మాట్లాడేందుకు వ‌చ్చారు. ఆ స‌మ‌యంలో ఆఫీస్ బాయ్‌ను పిలిచిన సీఐ... తన పేరు చెప్పి డబ్బు వసూలు చేస్తున్నావంటూ అత‌డిని సీఐ నిలదీయడమేగాక... చెప్పుతో కొట్టారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :