Studio18 News - ANDHRA PRADESH / AMARAVATI : కెంబూరి నైమిశా అతి చిన్న వయసులోనే జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికై ప్రశంసలు అందుకుంది. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలో పెరిగిన ఆమె, చిన్నతనం నుంచి న్యాయ వ్యవస్థపై ఆసక్తి కలిగి ఉంది. లా సెట్‌లో 300వ ర్యాంకు సాధించి ఆంధ్ర యూనివర్సిటీలో న్యాయశాస్త్రం చదివి, కష్టపడి చదివి జ్యుడీషియల్ సర్వీసెస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించింది. ఆమె విజయం మహిళలకు స్ఫూర్తినిస్తుంది.
అతి చిన్న వయసులో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికై శభాష్ అని ప్రశంసలు పొందుతున్న మహిళ కెంబూరి నైమిశా. అతి చిన్న వయసులో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన యువతి. విజయనగరం జిల్లా చీపురుపల్లికి చెందిన కెంబూరి నైమిశా చిన్నతనం నుంచి పట్టుదలతో ఉండేది. పెదనాన్న కెంబూరి రామ్మోహన్ రావు ఎంపీగా పని చేయగా, పెదనాన్న కెంబూరి లక్ష్మణ్ మోహన్ ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజి) గా రిటైర్ అయ్యారు. ఈమె మేనత్త కిమిడి మృణాళిని ఏపి రాష్ర్ట మంత్రిగా పనిచేశారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కావడంతో కెంబూరి నైమిశా ఇంటికి నిత్యం వందలాదిమంది ప్రజలు వచ్చి తమ ఇబ్బందులను విన్నవించుకొని సహాయం చేయమని కోరుతుండేవారు. చిన్నతనంలోనే అలాంటి ఎన్నో సమస్యలను దగ్గరుండి చూసిన నైమిశా తాను కూడా సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలని అనుకునేది. అంతేకాకుండా తన తండ్రి భరత్ మోహన్ బ్యాంకు మేనేజర్ గా పనిచేసేవాడు. అయితే తనకు బ్యాంక్ మేనేజర్ గా తన కెరియర్ ఆగిపోవడం ఇష్టం లేక ఎలాగైనా సివిల్ సర్వీసెస్ లో ఉద్యోగం దక్కించుకోవాలని తనకున్న బ్యాంక్ ఉద్యోగాన్ని వదులుకొని సివిల్స్ కోసం ప్రిపేర్ అయ్యాడు. అయితే ఆయన ఎంత కష్టపడ్డా సివిల్స్ లో మాత్రం స్థానం దక్కించుకోలేకపోయాడు. దీంతో అటు బ్యాంకు ఉద్యోగం లేక, కష్టపడి చదివినా సివిల్స్ లో ఉద్యోగం పొందలేక మానసికంగా ఎంతో ఇబ్బంది పడుతుండేవాడు.
Admin
Studio18 News