Thursday, 12 March 2026 03:42:57 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Viral Video: తాగి బడికొచ్చిన హెచ్‌ఎం.. విచారణకు వచ్చిన అధికారిపైనే బూతుల వర్షం.. ఇదిగో వీడియో

Date : 20 September 2025 06:19 PM Views : 178

Studio18 News - ANDHRA PRADESH / Vizianagaram : విజయనగరంలో ప్రధానోపాధ్యాయుడి నిర్వాకం ఫుల్లుగా తాగి పాఠశాలకు వచ్చిన హెచ్‌ఎం ఫిర్యాదులపై విచారణకు వెళ్లిన డిప్యూటీ డీఈఓ విచార‌ణ‌కు వ‌చ్చిన అధికారిపైనే అసభ్య పదజాలంతో దూషణలు సోషల్ మీడియాలో వైరలైన ఘటన వీడియో సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన ఓ ప్రధానోపాధ్యాయుడు, తాను పనిచేసే బడిలోనే మద్యం మత్తులో హల్‌చల్ చేశాడు. విచారణ కోసం వచ్చిన ఉన్నతాధికారిపైనే బూతుల వర్షం కురిపించి అందరినీ విస్మయపరిచాడు. ఈ షాకింగ్‌ ఘటన ఏపీలోని విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... మెంటాడ మండలం కుంటినవలస హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు గత కొంతకాలంగా మద్యం సేవించి విధులకు హాజరవుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఫిర్యాదులపై విచారణ చేపట్టేందుకు డిప్యూటీ డీఈఓ స్వయంగా పాఠశాలకు వెళ్లారు. అయితే, అప్పటికే మద్యం మత్తులో ఉన్న ఆ ప్రధానోపాధ్యాయుడు, అధికారిని చూసి సహనం కోల్పోయాడు. విచారణకు సహకరించకపోగా, ఆయన ముందే అసభ్య పదజాలంతో దూషణలకు దిగాడు. ఈ దృశ్యాలను అక్కడున్న వారు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించగా ఆ వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీంతో ఈ ఘటన విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ఈ వీడియో ఆధారంగా సదరు ప్రధానోపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. పవిత్రమైన బడిలోనే గురువు ఇలా ప్రవర్తించడంపై స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :