Thursday, 12 December 2024 02:03:38 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

KA Paul: తిరుపతిని కేంద్రపాలిత ప్రాంతం చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో కేఏ పాల్ పిటిషన్

Date : 01 October 2024 05:23 PM Views : 28

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : కోట్లాది మంది భక్తులు వచ్చే తిరుపతిని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. కేవలం 744 మంది క్యాథలిక్స్ ఉండే వాటికన్ సిటీ ప్రత్యేక దేశంగా ఉందని... కోట్లాది మంది భక్తులు వచ్చే తిరుపతిని కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తే తప్పేముందని ప్రశ్నించారు. 100 రోజుల కూటమి ప్రభుత్వ పాలన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే తిరుమల లడ్డూ వివాదాన్ని సీఎం చంద్రబాబు తీసుకొచ్చారని పాల్ విమర్శించారు. లడ్డూ నాణ్యతపై జూలై నెలలో ల్యాబ్ రిపోర్ట్ వస్తే... దాని గురించి సెప్టెంబర్ లో మాట్లాడటమేమిటని ప్రశ్నించారు. లడ్డూ వ్యవహారంపై సుప్రంకోర్టులో జరుగుతున్న విచారణలో మధ్యంతర ఉత్తర్వులను కోరుతూ పిటిషన్ వేశానని కేఏ పాల్ తెలిపారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ వంటి నేతలు శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. వీరు లడ్డూ గురించి మాట్లాడకుండా ఆదేశాలు జారీ చేయాలని తన పిటిషన్ లో కోరానని వెల్లడించారు. లడ్డూలో కల్తీ జరగకుండానే జరిగిందని చెబుతున్నారని... భక్తుల్లో గందగోళం సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు