Studio18 News - ANDHRA PRADESH / : CM Chandrababu: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మనుమడు దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం ఉదయం ఆయన కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వెంగమాంబ అన్నదాన వితరణ కేంద్రంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రసాదాలు పంపిణీ చేశారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.
తన మనుమడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా కులదైవమైన వేంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు పొందడానికి కుటుంబ సమేతంగా వచ్చామని అన్నారు. ప్రతీయేటా అన్నదానంకు విరాళం అందిస్తున్నామని, ఎన్టీఆర్ ప్రారంభించిన అన్నదానం ట్రస్ట్ కు ఇప్పటి వరకు రూ.2,200 కోట్ల విరాఠాలు అందాయని చంద్రబాబు తెలిపారు. భక్తులకు ప్రసాదం వడ్డించేటప్పుడు ఉండే అనుభూతి వెలకట్టలేనిదని అన్నారు. సమాజ హితంకోసం అందరూ పనిచేయాలి. ఏడు కొండలు.. వేంకటేశ్వర స్వామి సొంతం. ఈ ఏడు కొండల్లో ఎలాంటి అపవిత్ర కార్యక్రమాలు జరగకూడదు. నేను ఎప్పుడూ ప్రజాహితం కోసం పనిచేస్తా. తిరుమలలో పరిశుభ్రతకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నాం. రాష్ట్ర పున:నిర్మాణాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించానని చంద్రబాబు అన్నారు.
ప్రాణదానం ట్రస్ట్ ను తానే ప్రారంభించాను. తిరుపతిలోని అన్ని ఆస్పత్రుల ద్వారా రాయలసీమలో ఉండే అందరికీ వైద్యం అందించేలా ఏర్పాటు చేశామని చంద్రబాబు తెలిపారు. తిరుమలలో ఎవరూ అపచారం చేయొద్దు.. ఏడుకొండల్లో అపవిత్ర కార్యక్రమాలు జరగకూడదని చంద్రబాబు సూచించారు. అలిపిరిలో క్లైమోర్ మైన్ల దాడి నుంచి నేనే తప్పించుకున్నది ఒక మిరాకిల్. అదంతా స్వామివారి మహిమ అని చంద్రబాబు గుర్తుచేశారు. ఏడు కొండలను కమర్షియల్ చేయొద్దు. గతంలో అలిపిరి వద్ద ముంతాజ్ హోటల్ ఇతర ప్రైవేటు కార్యకలాపాలకు కేటాయించిన 35.32 ఎకరాలు క్యాన్సిల్ చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ప్రైవేట్ వ్యక్తులు ఉండడానికి వీలులేదని అన్నారు. దేశంలో స్వామివారి ఆస్తులు కాపడటంకోసం కంకణం కట్టుకొని ఉన్నామని, దేశంలో అన్ని రాజధానుల్లో శ్రీవారి ఆలయాలు నిర్మించాలని నిర్ణయించామని అన్నారు. ఆలయాల నిర్మాణంకోసం కొత్తగా నిధి ఏర్పాటు చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు.
Admin
Studio18 News