Thursday, 12 December 2024 12:38:35 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Pawan Kalyan : కనకదుర్గ ఆలయం మెట్లు శుభ్రం చేసిన పవన్ కల్యాణ్

Date : 24 September 2024 11:15 AM Views : 17

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : Pawan Kalyan at kanakadurga temple : తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు అవశేషాలు ఉన్నాయని ల్యాబ్ రిపోర్టులు రావడంతో దేశవ్యాప్తంగా కలకలకం సృష్టించింది. వైసీపీ హయాంలో ఆలయ పవిత్రతను దెబ్బతీశారని కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తో విచారణ జరిపిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. మరోవైపు తిరుమల లడ్డూ కల్తీ ఘటన నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గ ఆలయంలో ఆయన శుద్ది కార్యక్రమం నిర్వహించారు. ఉదయం విజయవాడలోని ఇంధ్రకీలాద్రిపై కనకదుర్గ ఆలయానికి చేరుకున్న పవన్ కల్యాణ్ కు ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం పవన్ ఆలయం వద్ద మెట్లను శుభ్రం చేశారు. ఆ తరువాత మెట్లకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఈ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం దుర్గమ్మను పవన్ దర్శించుకున్నారు. పవన్ కల్యాణ్ 11రోజుల ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. వచ్చే నెల 2వ తేదీన తిరుమలలో ప్రాయశ్చిత్త దీక్షను విరమిస్తారు. ఇందులో భాగంగా అక్టోబర్ 1వ తేదీన తిరుపతికి చేరుకొని.. అలిపిరి మెట్ల మార్గం ద్వారా నడుచుకుంటూ తిరుమల కొండపైకి పవన్ చేరుకోనున్నారు. 2వ తేదీ ఉదయం స్వామివారిని దర్శించుకొని.. అనంతరం ప్రాయశ్చిత్త దీక్షను విరమిస్తారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు