Sunday, 08 February 2026 01:06:30 AM
# AP News: 20 ఏళ్లు చిన్నవాడితో వివాహేత‌ర‌ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్యకు వివాహిత కుట్ర! # Chandrababu Naidu: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం # YS Sharmila: చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే: షర్మిల # Pakistan vs Netherlands: ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ థ్రిల్లింగ్ గెలుపు # Jairam Ramesh: భారత్, అమెరికా ట్రేడ్ డీల్... జైరామ్ రమేశ్ వ్యంగ్యం # KTR: ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్రిప్రమాదంపై కేటీఆర్ అనుమానాలు # Narendra Modi: మలేషియా రాజధానిలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం... స్వయంగా ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రధాని అన్వర్ # Elon Musk: ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్‌లో చైనా పెట్టుబడులు.. అమెరికా భద్రతకు ముప్పంటూ సెనేటర్ల ఆందోళన # Tiger: జనగామ జిల్లాలో మరో రెండు లేగదూడలను చంపిన పులి.. సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించినట్లు అనుమానం # Medaram Jatara: జాతర ముగింపు.. టన్నుల కొద్దీ చెత్త, జంతు వ్యర్థాలతో... మురికికూపంలా మేడారం # Pawan Kalyan: సోషల్ మీడియాలో విద్యార్థుల గోడు... కదిలిపోయిన పవన్ కల్యాణ్ # Asha Cheetah: కూనో నేషనల్ పార్కులో ఐదు చీతా కూనల జననం # Vijaya Reddy: పిల్లలతో కలిసి విజయారెడ్డి ఆత్మహత్య: ఆ ఛానళ్లపై పరువు నష్టం దావా వేస్తానన్న సోదరుడు # 'పరాశక్తి' (జీ 5) మూవీ రివ్యూ! # AP SSC Exams: ఏపీ పదో తరగతి పరీక్షలు... ఇంగ్లీషు పరీక్ష తేదీ మారింది! # Shilpavalli: నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్నిప్రమాదంపై డీసీపీ ఏమన్నారంటే..! # Zelensky: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా గడువు.. జెలెన్‌స్కీ కీలక ప్రకటన # Srinivas Varma: వైవీ సుబ్బారెడ్డి ఒప్పుకున్నప్పుడు... జగన్ కు ఏంటి బాధ?: శ్రీనివాసవర్మ # Chandrababu Naidu: అమరావతిలో క్వాంటం వ్యాలీ... శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ # Vikram Singh: ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం.. కారణం వెల్లడించిన ఫైర్ డీజీ విక్రమ్ సింగ్

పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి దుర్మరణం

Date : 13 May 2025 12:08 PM Views : 310

Studio18 News - ANDHRA PRADESH / Palnadu : పల్నాడు జిల్లాలో ఈ ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదం నింపింది. ఈ దుర్ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. బొలెరో వాహనాన్ని లారీ ఢీకొనడంతో ఈ దారుణం జరిగింది. వినుకొండ మండలం శివాపురం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బొప్పాయి కాయలతో వెళుతున్న బొలెరో వాహనాన్ని ఎదురుగా వస్తున్న లారీ వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో తుదిశ్వాస విడిచాడు. మృతులంతా ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం గడ్డమీదపల్లి గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలుగా పోలీసులు గుర్తించారు. పనుల నిమిత్తం వీరు ప్రయాణిస్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో గడ్డమీదపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం వారికి వైద్య చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. మంత్రి నారా లోకేశ్ దిగ్భ్రాంతి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ రోడ్డు ప్రమాద ఘటనపై రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని, ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :