Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : వైసీపీ అధినేత జగన్ పై టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో మద్యం అమ్మకాల ద్వారా జగన్ వేల కోట్ల రూపాయలు సంపాదించారని ఆయన ఆరోపించారు. జే గ్యాంగ్ బ్రాండ్లను బలవంతంగా ప్రజలపై రుద్దారని మండిపడ్డారు. కల్తీ మద్యంపై జగన్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. చంద్రబాబుకు జగన్ మాదిరి సంపాదించడం తెలియదని చెప్పారు. లాటరీ ప్రక్రియ ద్వారా పారదర్శకంగా మద్యం దుకాణాలను కేటాయించారని తెలిపారు. ప్రముఖ కంపెనీల బ్రాండ్లను చంద్రబాబు అందుబాటులోకి తెస్తున్నారని చెప్పారు.
Admin
Studio18 News