Monday, 02 December 2024 03:43:27 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Amaravati Works: అమరావతి పనులను ప్రారంభించిన చంద్రబాబు

Date : 19 October 2024 01:32 PM Views : 27

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు పునఃప్రారంభించారు. సీఆర్డీఏ పనుల ద్వారా రాజధాని పనులను ఆయన ప్రారంభించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2017లో రూ. 160 కోట్లతో ఎనిమిది అంతస్తుల సీఆర్డీఏ కార్యాలయ పనులను ప్రారంభించారు. ఆ పనులు మధ్యలో ఆగిపోయాయి. ఇప్పుడు సీఆర్డీఏ కార్యాలయం నుంచే పనులను ముఖ్యమంత్రి ప్రారంభించారు. తుళ్లూరు మండలం ఉద్ధండరాయునిపాలెం వద్ద పనులకు శ్రీకారం చుట్టారు. అక్కడ చంద్రబాబు పూజలు నిర్వహించారు. మొత్తం 3.62 ఎకరాల్లో జీ ప్లస్ 7 అంతస్తులతో ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. అదనంగా ల్యాండ్ స్కేపింగ్, పార్కింగ్ కు 2.51 ఎకరాలు కేటాయించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ బిల్డింగ్ లో ఆర్కిటెక్చరల్ ఫినిషింగ్స్, ఇంటీరియర్స్, ఎలక్ట్రిక్ పనులు పెండింగ్ లో ఉన్నాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు