Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : సౌర విద్యుత్ ఒప్పందాల్లో భాగంగా అదానీ ముడుపుల వ్యవహారంలో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ పూర్తిగా ఇరుక్కున్నారని సీనియర్ రాజకీయ నేత గోనె ప్రకాశ్ రావు అన్నారు. ఆ కేసు నుంచి జగన్ బయటపడే అవకాశమే లేదని చెప్పారు. లంచం కేసులో అదానీ, జగన్ ఇద్దరూ అరెస్ట్ అవుతారని అభిప్రాయపడ్డారు. వీరిద్దరి అరెస్ట్ ను ప్రధాని మోదీ కూడా ఆపలేరని చెప్పారు. న్యూయార్క్ టైమ్స్ లో దీనికి సంబంధించిన కథనం వచ్చిందని... ఆ పత్రికలో కథనం వస్తే కథ ముగిసినట్టేనని అన్నారు. వీరిద్దరినీ తమకు అప్పజెప్పాలని అమెరికా కోరుతుందని... మోదీ కూడా దీన్ని ఆపలేదని చెప్పారు. అయితే దీనికి మూడు నెలలు పడుతుందా? లేదా ఆరు నెలలు పడుతుందా? అనేది చెప్పలేమని అన్నారు. ఏపీలో సోలార్ పవర్ కొనుగోళ్ల కోసం అందానీ లంచాలు ఇచ్చారంటూ అమెరికా కోర్టులో కేసు నమోదైన సంగతి తెలిసిందే. జగన్ కు రూ. 1,750 కోట్ల ముడుపులు అందాయనే విషయాన్ని ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. ఈ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ అంశంపై మాట్లాడుతూ గోనె ప్రకాశ్ రావు పైవ్యాఖ్యలు చేశారు.
Also Read : నారా లోకేశ్ తో చాగంటి కోటేశ్వరరావు భేటీ
Admin
Studio18 News