Studio18 News - ANDHRA PRADESH / : వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు, వరుస అరెస్టుల నేపథ్యంలో ఇటీవల తనను క్షమించాలంటూ వీడియో విడుదల చేసిన నటి శ్రీరెడ్డి తాజాగా వైసీపీ అధ్యక్షుడు జగన్, మంత్రి లోకేశ్‌కు కలిపి ఒకే లేఖ రాశారు. అందులో తొలుత జగన్ గురించి ప్రస్తావిస్తూ.. జగన్, భారతీరెడ్డిని దగ్గరి నుంచే అదృష్టం తనకు దక్కలేదని, టీవీల్లో చూసి ఆనందిస్తుంటానని పేర్కొంది. పార్టీలో తాను సభ్యురాలిని కాకపోయినా, తన వాణిని బలంగా వినిపించానని, అయితే, తన వ్యాఖ్యలతో పార్టీకి చెడ్డపేరు వస్తుందని, పార్టీకి నష్టం జరుగుతుందని అంచనా వేయలేకపోయానని విచారం వ్యక్తం చేసింది. ఇప్పుడు తప్పు తెలుసుకుని పార్టీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని పేర్కొంది. అనంతరం మంత్రి లోకేశ్‌ను.. లోకేశ్ అన్నా అని సంబోధిస్తూ ఇకపై తాను ఎప్పుడూ ఎవరినీ ఇబ్బంది పెట్టేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయబోనని, తనకు ఇష్టమైన దేవుడిపై ప్రమాణం చేసి చెబుతున్నానని, తనను క్షమించాలని వేడుకుంది. వారం రోజులుగా తిండీ నిద్ర లేకుండా కుమిలిపోతున్నానని, తనతోపాటు తన కుటుంబ సభ్యులు వేల సంవత్సరాలకు సరిపడా క్షోభ అనుభవించారని, తనను వదిలివేయాలని విజ్ఞప్తి చేసింది.
Also Read : 25 లక్షల కోట్ల ఆస్తి.. ప్రపంచంలోనే రిచ్చెస్ట్ ఫ్యామిలీ ఇది!
Admin
Studio18 News