Sunday, 08 February 2026 10:21:24 AM
# AP News: 20 ఏళ్లు చిన్నవాడితో వివాహేత‌ర‌ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్యకు వివాహిత కుట్ర! # Chandrababu Naidu: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం # YS Sharmila: చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే: షర్మిల # Pakistan vs Netherlands: ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ థ్రిల్లింగ్ గెలుపు # Jairam Ramesh: భారత్, అమెరికా ట్రేడ్ డీల్... జైరామ్ రమేశ్ వ్యంగ్యం # KTR: ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్రిప్రమాదంపై కేటీఆర్ అనుమానాలు # Narendra Modi: మలేషియా రాజధానిలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం... స్వయంగా ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రధాని అన్వర్ # Elon Musk: ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్‌లో చైనా పెట్టుబడులు.. అమెరికా భద్రతకు ముప్పంటూ సెనేటర్ల ఆందోళన # Tiger: జనగామ జిల్లాలో మరో రెండు లేగదూడలను చంపిన పులి.. సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించినట్లు అనుమానం # Medaram Jatara: జాతర ముగింపు.. టన్నుల కొద్దీ చెత్త, జంతు వ్యర్థాలతో... మురికికూపంలా మేడారం # Pawan Kalyan: సోషల్ మీడియాలో విద్యార్థుల గోడు... కదిలిపోయిన పవన్ కల్యాణ్ # Asha Cheetah: కూనో నేషనల్ పార్కులో ఐదు చీతా కూనల జననం # Vijaya Reddy: పిల్లలతో కలిసి విజయారెడ్డి ఆత్మహత్య: ఆ ఛానళ్లపై పరువు నష్టం దావా వేస్తానన్న సోదరుడు # 'పరాశక్తి' (జీ 5) మూవీ రివ్యూ! # AP SSC Exams: ఏపీ పదో తరగతి పరీక్షలు... ఇంగ్లీషు పరీక్ష తేదీ మారింది! # Shilpavalli: నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్నిప్రమాదంపై డీసీపీ ఏమన్నారంటే..! # Zelensky: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా గడువు.. జెలెన్‌స్కీ కీలక ప్రకటన # Srinivas Varma: వైవీ సుబ్బారెడ్డి ఒప్పుకున్నప్పుడు... జగన్ కు ఏంటి బాధ?: శ్రీనివాసవర్మ # Chandrababu Naidu: అమరావతిలో క్వాంటం వ్యాలీ... శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ # Vikram Singh: ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం.. కారణం వెల్లడించిన ఫైర్ డీజీ విక్రమ్ సింగ్

Chandrababu: అందులో ఒక శాతం నా భాగస్వామ్యం ఉన్నందుకు గర్విస్తున్నా: సీఎం చంద్రబాబు

కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేడు సభలో స్వర్ణాంధ్ర విజన్ పై లఘు చర్చ 10 సూత్రాల ఆధారంగా విజన్ అమలు చేస్తున్నామన్న చంద్రబాబు

Date : 17 March 2025 04:59 PM Views : 301

Studio18 News - ANDHRA PRADESH / : స్వర్ణాంధ్ర విజన్-2047 డాక్యుమెంట్ పై నేడు ఏపీ అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, 10 సూత్రాలు నిర్దేశించుకుని స్వర్ణాంధ్ర విజన్ వైపు అడుగులేస్తున్నామని చెప్పారు. తెలుగు బిడ్డ పీవీ నరసింహారావు సంస్కరణలతో దేశం అభివృద్ధి బాటలో ముందుకు పోతోందని... ఈ సంస్కరణల్లో ఒక శాతం నా భాగస్వామ్యం ఉన్నందుకు గర్విస్తున్నానని చంద్రబాబు తెలిపారు. 2047 నాటికి ప్రపంచవ్యాప్తంగా భారతీయులు నెంబర్ వన్ గా నిలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి అప్పటికి వందేళ్లు పూర్తవుతాయని పేర్కొన్నారు. పేదరికం లేని సమాజం, టెక్నాలజీ, పీ4 వంటి అంశాలను విజన్ డాక్యుమెంట్ లో పొందుపరిచామని తెలిపారు. రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం, మున్సిపాలిటీ, మండలాల వారీగా విజన్ ప్రణాళిక సిద్ధమైందని అన్నారు. సచివాలయం యూనిట్ గా తీసుకుని ప్రణాళిక అమలు చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్టు సీఎం చంద్రబాబు వెల్లడించారు. ప్రజల సామాజిక ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయో అంచనాలు రూపొందిస్తామని తెలిపారు. ప్రజలే ఆస్తిగా నియోజకవర్గాల ప్రోగ్రెసివ్ విజన్ రూపొందించామని చెప్పారు. ప్రతి కుటుంబానికి సామాజిక భద్రత కల్పించాల్సి ఉందని పేర్కొన్నారు. కుటుంబ జీవన ప్రమాణాలు పెరిగేలా ఆర్థిక స్వావలంబన దిశగా కృషి చేస్తున్నట్టు వివరించారు. చేపలు ఇవ్వడం కాదు... చేపలు పట్టేలా ప్రోత్సహించడమే తమ లక్ష్యం, తమ ప్రభుత్వ విధానమని చంద్రబాబు ఉద్ఘాటించారు. ప్రతి కుటుంబానికి నివాస స్థలం, ఇల్లు, మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యమని అన్నారు. సురక్షిత నీరు, గ్యాస్ కనెక్షన్ ఇలా అన్ని సౌకర్యాలు అందడమే లక్ష్యం అని వివరించారు. రానున్న రోజుల్లో సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజి విద్యుదుత్పత్తి రంగాలు గేమ్ చేంజర్ లా మారతాయని స్పష్టం చేశారు. సంపద సృష్టికి తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, పరిశ్రమలు తీసుకురావడమే బాధ్యతగా ఎమ్మెల్యేలు పనిచేయాలని చంద్రబాబు సూచించారు. గత ప్రభుత్వం తరహాలో పరిశ్రమలను తరిమేయొద్దని అన్నారు. గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ధ్వంసమైన రాష్ట్రాన్ని మళ్లీ ట్రాక్ లో పెట్టగలిగామని, ఇలాంటి సమయంలో దూరదృష్టితో ఆలోచించి ప్రణాళికలు రూపొందించుకోవాలని పేర్కొన్నారు. 1990లోనే సమైక్యాంధ్ర ప్రదేశ్ కోసం విజన్ 2020 తీసుకొచ్చామని, చెప్పిన దానికంటే ఎక్కవ ప్రయోజనమే ఉమ్మడి రాష్ట్రానికి కలిగిందని వెల్లడించారు. ప్రధాని మోదీ వికసిత భారత్-2047ని అమలు చేస్తున్నారని, మనం స్వర్ణాంధ్ర విజన్-2047ని అమలు చేస్తున్నామని చెప్పారు. ఎమ్మెల్యేలను భాగస్వాములుగా చేస్తూ నియోజకవర్గ విజన్ డాక్యుమెంట్లకు రూపకల్పన చేస్తున్నట్టు వివరించారు. 2047 నాటికి ఏపీ 2.4 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మారడమే లక్ష్యమని, తలసరి ఆదాయం రూ.55 లక్షలు సాధించేలా విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేశామని అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 17.11 శాతం మేర వృద్ధి రేటు సాధించేలా లక్ష్యం నిర్దేశించుకున్నట్టు చంద్రబాబు వెల్లడించారు. రాయలసీమ రాళ్ల సీమగా మారిపోతుందనుకున్నారని, కానీ రాయలసీమ రతనాల సీమగా మారడం ఖాయమని అన్నారు. ఆర్థిక వ్యవస్థలో అనంతపురం ఐదోస్థానానికి వచ్చిందని వివరించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :