Studio18 News - ANDHRA PRADESH / : విశాఖ శారదాపీఠంకు ఏపీ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన స్థలం అనుమతిని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తిరుమల కొండపై నిబంధనలకు విరుద్ధంగా శారదా పీఠం చేపట్టిన నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని టీటీడీని ఆదేశించింది. విశాఖలో 15 ఎకరాల స్థలం విలువ రూ. 220 కోట్లు అయితే... కేవలం రూ. 15 లక్షల నామమాత్రపు ధరకు శారదా పీఠానికి గత ప్రభుత్వం ఇచ్చింది. కూటమి ప్రభుత్వ వచ్చాక ఈ స్థలంపై దర్యాప్తు చేపట్టింది. దర్యాప్తు అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా స్థలం అనుమతులను ప్రభుత్వం రద్దు చేసింది.
Admin
Studio18 News