Thursday, 12 December 2024 01:26:45 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

kadapa yogi vemana university: పదవి నుంచి వైదొలగిన కడప యోగి వేమన వర్సిటీ రిజిస్ట్రార్

Date : 15 October 2024 11:17 AM Views : 19

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : కడప యోగి వేమన విశ్వ విద్యాలయం రిజిస్ట్రార్ తప్పెట రాంప్రసాద్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా లేఖను వైస్ ఛాన్స్‌లర్ కృష్ణారెడ్డి ఆమోదించారు. విశ్వవిద్యాలయం తెలుగు ప్రొఫెసర్‌గా ఉన్న రాంప్రసాద్ రెడ్డి పది రోజుల క్రితమే రిజిస్ట్రార్‌గా బాధ్యతలు చేపట్టారు. అయితే 2011లో విద్యార్థినులను విహారయాత్రకు తీసుకువెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్న ఆరోపణలు రాంప్రసాద్ రెడ్డిపై వచ్చాయి. దానిపై గతంలోనే త్రిసభ్య కమిటీ నియమించి విచారణ చేపట్టగా వేధింపులు నిజమని నిర్ధారణ కావడంతో ఆయనను దూరం పెట్టారు. అయితే వైసీపీ హయాంలో ఆ పార్టీ నేతలతో అంటకాగిన రాంప్రసాద్ రెడ్డి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తాను టీడీపీకి విధేయుడిని అని ప్రచారం చేసుకుని జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు తెచ్చుకుని యూనివర్శిటీ రిజిస్ట్రార్ గా బాధ్యతలు తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. విద్యార్ధులకు నైతిక విలువలు నేర్పాల్సిన వర్శిటీలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ఉన్నత పదవులు కట్టబెట్టడం ఏమిటని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. రిజిస్ట్రార్ లైంగిక వేధింపుల బాగోతంపై ఆధారాలు సహా విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు విద్యార్థి సంఘ నేతలు ఫిర్యాదు లేఖలు పంపించారు. వీసీ, రిజిస్ట్రార్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఇటీవల ఆందోళన కూడా చేశారు. వారిని విధుల నుండి తొలగించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని కూడా హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే రాంప్రసాద్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు