Sunday, 08 March 2026 10:44:36 PM
# భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు ఘన ఏర్పాట్లు # ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ మహిళా కార్మికులకు సన్మానం # అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభ నిర్వహణ # టీజీఎస్‌ఆర్టీసీ డిపోలలో మహిళా దినోత్సవ వేడుకలు # బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం # స్నేహానికి నిలువెత్తు నిదర్శనం… స్నేహితురాలికి రూ.70 వేల ఆర్థిక సహాయం # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులకు సన్మానం # వేములవాడ హత్య కేసును ఛేదించిన పోలీసులు # మహిళల సమాన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య

Tirumala Laddu: తిరుమల నెయ్యి కల్తీపై వైసీపీ నేత తమ్మినేని కీలక వ్యాఖ్యలు

Date : 26 September 2024 12:01 PM Views : 326

Studio18 News - ANDHRA PRADESH / : తిరుమల శ్రీవారి లడ్డూపై దుమారం కొనసాగుతున్న వేళ.. వైసీపీ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కల్తీ నెయ్యిగా చెబుతున్నది పోషకాహార లోపంతో బాధపడుతున్న ఆవుల నుంచి వచ్చే పాలతో తయారుచేసే నెయ్యి కావొచ్చని.. ఆవాలు, అవిశలు, పామాయిలు వంటి వ్యర్థాలను ఆహారంగా తీసుకునే ఆవుల పాల నుంచి తయారుచేసే నెయ్యి అయి ఉండొచ్చని పేర్కొన్నారు. కూటమి నేతలు ఆరోపిస్తున్నట్టు లడ్డూలో ఇతర పదార్థాలు కలిస్తే అలాంటివి లోపలికి అనుమతించింది మీరే అవుతారని విమర్శించారు. పరీక్షల్లో కచ్చితత్వం లోపించే అవకాశం లేకపోలేదని, ఎస్‌డీబీబీ తన నివేదికలో స్పష్టం చేసిందని తెలిపారు. ఎంతో భద్రంగా చేయాల్సిన పనిని అల్లరి చేస్తే మన దేవుడిని మనమే తగ్గించుకోవడం అవుతుందన్నారు. చంద్రబాబునాయుడు చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలతో హిందువుల మనోభావాలు దెబ్బతినే దుస్థితి వచ్చిందని తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :