Tuesday, 31 March 2026 04:31:35 PM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

Sravani: భర్తపై కోపంతో పసికందును వదిలివెళ్లిన భార్య

Date : 28 January 2026 07:32 PM Views : 84

Studio18 News - ANDHRA PRADESH / : భార్య శ్రావణిని వదిలించుకునే ఉద్దశంతో దువ్వాడ రైల్వే స్టేషన్‌ వద్ద రైలు దిగి వెళ్లిన భర్త అర్జున్ మనస్తాపంతో ఐదు నెలల పసికందును ఆటోలో వదిలివెళ్లిన శ్రావణి బాలుడి తల్లిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న విశాఖ ఆర్పీఎఫ్ పోలీసులు భర్త తనను విడిచిపెట్టేశాడన్న కోపంతో ఐదు నెలల పసికందును రైల్వే స్టేషన్‌ సమీపంలో ఆటోలో వదిలేసిన తల్లి ఘటన స్థానికంగా సంచలనం రేపింది. వివరాల్లోకి వెళితే.. ఉపాధి నిమిత్తం గత ఏడాది శ్రావణి, అర్జున్‌ దంపతులు విజయవాడకు వెళ్లారు. అయితే ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరగడంతో వారి దాంపత్య జీవితం గందరగోళంగా మారింది. విజయవాడలో పనులు సరిగా లేకపోవడంతో ఇద్దరూ జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ రైలులో విశాఖపట్నం బయలుదేరారు. ఈ ప్రయాణంలో భార్యను వదిలించుకునే ఉద్దేశంతో దువ్వాడ రైల్వే స్టేషన్‌ వద్ద భర్త అర్జున్‌ రైలు దిగిపోయినట్లు తెలుస్తోంది. ఎంత వెతికినా భర్త ఆచూకీ లభించకపోవడంతో తనను ఉద్దేశపూర్వకంగానే వదిలేశాడని శ్రావణి భావించినట్లు సమాచారం. విశాఖపట్నం రైల్వే స్టేషన్‌కు చేరుకున్న అనంతరం తీవ్ర మనస్తాపానికి లోనైన శ్రావణి, ఐదు నెలల పసికందును ఓ ఆటోలో వదిలేసి సమీపంలోని ఓ కాంప్లెక్స్‌ వైపు వెళ్లిపోయింది. ఆటోలో పసికందు ఒంటరిగా ఉన్న విషయాన్ని గమనించిన డ్రైవర్లు వెంటనే ఆర్పీఎఫ్‌ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఆర్పీఎఫ్‌ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా బాలుడి తల్లిని గుర్తించి ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :