Tuesday, 31 March 2026 04:35:23 PM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

Gudivada Amarnath: ఏపీకి మిట్టల్ స్టీల్ ప్లాంట్ రావడానికి జగనే కారణం

Date : 24 March 2026 02:32 PM Views : 7

Studio18 News - ANDHRA PRADESH / Anakapalli : అనకాపల్లి జిల్లాలో నక్కపల్లికి అర్సెలర్‌ మిట్టల్ స్టీల్ ప్లాంట్ రావడానికి అసలు కారణం వైసీపీ అధినేత జగన్ అని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. దావోస్ పర్యటనలో ఆదిత్య మిట్టల్‌తో జగన్ జరిపిన చర్చల ఫలితంగానే ఈ భారీ ప్రాజెక్టు పట్టాలెక్కిందని గుర్తుచేశారు. ఆదిత్య మిట్టల్ కోరిన విధంగానే నక్కపల్లి వద్ద 4 వేల ఎకరాల భూమిని చూపించామని, ఎన్నికల నోటిఫికేషన్ సమయంలోనే దీనిపై స్పష్టత వచ్చిందని ఆయన వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి కొత్తగా వచ్చిన పరిశ్రమలపై శ్వేతపత్రం విడుదల చేయాలని అమర్‌నాథ్ డిమాండ్ చేశారు. జగన్ హయాంలో వచ్చిన బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణం ఇప్పటికీ పూర్తి చేయలేకపోవడంపై ఆయన విమర్శలు గుప్పించారు. 35 వేల మందికి ఉపాధి కల్పించాల్సిన ఈ ప్రాజెక్టు ప్రస్తుతం అయోమయంలో పడిందని, విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. గడిచిన కాలంలో సుమారు రూ. 6,500 కోట్ల పెట్టుబడులు రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోయాయని ఆయన ఆరోపించారు. ఇదే క్రమంలో వైఎస్ షర్మిల చేస్తున్న ఆరోపణలపై అమర్‌నాథ్ తీవ్రంగా స్పందించారు. "మీ రాజకీయ అవసరాల కోసం జగన్ వ్యక్తిత్వాన్ని కించపరచకండి. ఎవరి చేతిలోనూ రాజకీయ పావుగా మారకండి" అని హితవు పలికారు. షర్మిల వ్యాఖ్యల వల్ల వైసీపీ కార్యకర్తల నుంచి తమపై ఒత్తిడి పెరుగుతోందని, ఇప్పటివరకు జగన్ తమను కట్టడి చేస్తున్నారని చెప్పారు. ఒకవేళ హద్దు మీరితే మాత్రం మిగతా రాజకీయ పార్టీ నాయకులకు ఎలా సమాధానం చెబుతామో, ఆమెకు కూడా అలాగే బదులిస్తామని హెచ్చరించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :