Sunday, 08 March 2026 10:35:45 PM
# భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు ఘన ఏర్పాట్లు # ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ మహిళా కార్మికులకు సన్మానం # అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభ నిర్వహణ # టీజీఎస్‌ఆర్టీసీ డిపోలలో మహిళా దినోత్సవ వేడుకలు # బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం # స్నేహానికి నిలువెత్తు నిదర్శనం… స్నేహితురాలికి రూ.70 వేల ఆర్థిక సహాయం # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులకు సన్మానం # వేములవాడ హత్య కేసును ఛేదించిన పోలీసులు # మహిళల సమాన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య

Melioidosis: కొత్తరెడ్డిపాలెంలో మెలియాయిడోసిస్!

Date : 13 September 2025 07:27 PM Views : 184

Studio18 News - ANDHRA PRADESH / Guntur : జ్వరంతో బాధపడుతున్న తొమ్మిది మందికి పరీక్షలు నలుగురికి అనుమానిత లక్షణాలు కనిపించడంతో వైద్యులు అలర్ట్ పూర్తిస్థాయి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడి గుంటూరు జిల్లాలోని తురకపాలెంలో వెలుగు చూసిన మెలియాయిడోసిస్ కేసులు ప్రస్తుతం చేబ్రోలు మండలంలోనూ ఆందోళన కలిగిస్తున్నాయి. మెలియాయిడోసిస్ బాధితులు గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొత్తరెడ్డిపాలెం గ్రామానికి చెందిన చల్లా సీతారామిరెడ్డి మరణించారు. దీంతో వైద్యాధికారులు కొత్తరెడ్డిపాలెం గ్రామంపైనా దృష్టిసారించారు. ఇటీవల జ్వరం బాధిత పడిన తొమ్మిది మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. నలుగురిలో కొకై రకం బ్యాక్టీరియా ఆనవాళ్లు కనిపించాయని చెప్పారు. దీంతో వారికి పూర్తిస్థాయి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 12న చేబ్రోలుకు చెందిన ఆశా వర్కర్ సులోచన కూడా జ్వరం, ఉబ్బసం లక్షణాలతో మృతి చెందారు. సులోచన వయసు 45 ఏళ్లే కావడం, జ్వరంతో మరణించడంపై అనుమానాలు వస్తున్నాయి. దీంతో ఆమెకు సంబంధించిన వైద్య పరీక్షల నివేదికల్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. గ్రామంలో అనారోగ్యం బారిన పడిన వారికి చేబ్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. వారు కోలుకుంటున్నట్లు వెల్లడించారు. కాగా, కొత్తరెడ్డిపాలెంలో ఫీవర్ కేసులు అధికంగా వస్తున్నాయని చేబ్రోలు పీహెచ్‌సీ వైద్యురాలు ఊర్మిళ తెలిపారు. తొమ్మిది మందికి బ్లడ్ కల్చర్ టెస్టు చేయగా ఐదుగురిలో స్టెఫెలో కొకై బ్యాక్టీరియా పాజిటివ్‌గా తేలిందని వివరించారు. మరో కేసులో మెలియాయిడోసిస్ కేసుగా అనుమానాలున్నాయని పేర్కొన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :