Studio18 News - ANDHRA PRADESH / AMARAVATI : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రుణాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందుతుందని, అందుకు అనుగుణంగానే రాజధానికి రుణాలు సమకూర్చే వ్యవహారంలో సహాయ సహకారాలు అందిస్తోందని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలు ఆంధ్రప్రదేశ్ అప్పుల పరిధిలోకి రావని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఈ రుణాలను ఆంధ్రప్రదేశ్ అప్పుల పరిమితిలోకి లెక్కించకూడదని నిర్ణయించినట్లు తెలిపింది. ఈ మేరకు లోక్ సభలో వైసీపీ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
Admin
Studio18 News