Studio18 News - ANDHRA PRADESH / : నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకుడు దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన లింగసముద్రం మండలంలో చోటు చేసుకుంది. తాతా హోటల్ పక్కన జంపాలవారపాలెంలో టీడీపీ నాయకుడు తోవూరి నరసింహంను బ్రహ్మయ్య కత్తితో పొడిచి హత్య చేశాడు. అంతటితో ఆగకుండా రెండు రోజులుగా నరసింహం మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి బోరుబావిలో వేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నరసింహం నిమ్మతోట వద్ద బ్రహ్మయ్య కాపలాదారుడిగా పని చేస్తున్నట్లు సమాచారం. అయితే వీరిద్దరి మధ్య ఏ విషయంలో వివాదం జరిగింది, నరసింహంను ఇంత దారుణంగా ఎందుకు హత్య చేశాడు అనే విషయాలు తెలియాల్సి ఉంది. నరసింహం కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బ్రహ్మయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు బోరుబావి వద్దకు వెళ్లి ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.
Admin
Studio18 News