Wednesday, 25 June 2025 07:15:03 AM
# గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు # బాలికకు వాతలు పెట్టిన ఘటనపై ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి స్పందన # ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు

ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లతో ఉపాధి అవకాశాల కల్పన జరుగుతుందన్న మంత్రి భరత్ పత్తికొండలో రూ.11 కోట్లతో ఇంటిగ్రేటెడ్ టమోటా ప్రాసెసింగ్ యూనిట్ కు భూమి పూజ ఇ

ఆరు నెలల్లో ఇంటిగ్రేటెడ్ టొమాటో ప్రాసెసింగ్ యూనిట్ ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని రాష్ర్ట పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ

Date : 15 March 2025 10:53 AM Views : 89

Studio18 News - ANDHRA PRADESH / : ఆరు నెలల్లో ఇంటిగ్రేటెడ్ టొమాటో ప్రాసెసింగ్ యూనిట్ ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని రాష్ర్ట పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. శుక్రవారం పత్తికొండ మండలం, దూదేకొండ రెవెన్యూ గ్రామం, కోతిరాళ్ళ పంచాయతీ వద్ద రూ.11 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ టమోటా ప్రాసెసింగ్ యూనిట్ కు మంత్రి టీజీ భరత్..ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబుతో కలిసి భూమి పూజ నిర్వహించి శిలాఫలకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టొమాటో ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని కర్నూలు ఎంపీ, పత్తికొండ ఎంఎల్ఏలు ఇటీవల ముఖ్యమంత్రిని కోరగా, వెంటనే అందుకు సంబంధించిన పనులు చేయాలని సీఎం ఆదేశించడం జరిగిందన్నారు. ఈ ప్రాజెక్టు ఏర్పాటు కొరకు నిధులు పుష్కలంగా ఉన్నాయన్నారు. జిల్లాలో పత్తికొండ ప్రాంతంలో టొమాటో పంట సాగు చాలా ఎక్కువగా ఉంటుందన్నారు. ఈ యూనిట్ ఏర్పడిన తర్వాత టొమాటో‌లు రోడ్ల మీద పడేసే పరిస్థితి ఎక్కడా ఉండదన్నారు. రానున్న రోజుల్లో ప్రైవేట్ వ్యక్తులు కూడా చాలా మంది ఈ యూనిట్‌లు పెట్టేందుకు ముందుకు వస్తారన్నారు. అదే విధంగా తుగ్గలి, దేవనకొండ, కృష్ణగిరి, ఆదోని, గొనేగండ్ల, ఆస్పరి, ఆలూరు ప్రాంతాల వారికి ఈ యూనిట్ చాలా ఉపయోగపడే అవకాశం ఉంటుందన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకి సంబంధించి కేంద్ర ప్రభుత్వంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా రాయితీలు ఇస్తుందన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ అంశం‌పై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించిన సమయంలో ఈ 5 ఏళ్లలో 30 వేల కోట్ల పెట్టుబడులు ఫుడ్ ప్రాసెసింగ్ రంగం ద్వారా రావాలని ఆదేశాలు జారీ చేయడం జరిగిందని, టార్గెట్ పెట్టుకొని కష్టపడుతున్నట్లు చెప్పారు. వలసలు నివారించి పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్‌లో చాలా మేరకు పెద్ద ఎత్తున పరిశ్రమలు రానున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి సంఘం చైర్మన్ బొజ్జమ్మ, పత్తికొండ ఆర్డీఓ భరత్, జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, తుగ్గలి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :