Monday, 08 December 2025 04:00:00 AM
# నీలాద్రి అడవి జింకలను వేటాడి చంపిన నలుగురు నిందితులు అరెస్ట్ # అయ్యప్పమాల వేసుకున్నాడని స్టూడెంట్‎ను కాలేజీ యాజమాన్యం కాలేజీ లోపలికి రానివ్వలేదు. # అంబర్పేట్ లో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించిన కాంగ్రెస్ నేతలు # లీకేజీల బెడద.. మరమ్మతులపై నిర్లక్ష్యం..? # కోటలో ఆర్.వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఘన నివాళులు # రైల్వే డిఆర్‎ఎం లలిత్ బొహరాతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భేటీ # అత్యంత ఘనంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం # రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం... ఆర్టీసీ డ్రైవర్ పై దాడి # వేములవాడలో భారీ అగ్ని ప్రమాదం..70 క్వింటాళ్ల పత్తి దగ్ధం # మంత్రి దామోదర రాజనర్సింహ జన్మదిన వేడుకలు # తీన్మార్ మల్లన్న హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు # మంజీరో హై స్కూల్లో అండర్ 16 కోకో టోర్నమెంట్.. # ఏ.ఎస్.రావు నగర్‎లో జోయాలుక్కాస్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ ప్రారంభం # దాచేపల్లిలో కాపు కమ్యూనిటీ భవన శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే # గుంటూరు జిల్లాలో పర్యటించిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు # ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ # నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జక్కుల గంగరాజు.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ స్వతంత్ర అభ్యర్థి పెద్ది కృష్ణమూర్తి గౌడ్.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసిన దేవరుప్పుల గ్రామ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏల సుందర్ # మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

Ambati Rambabu: వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు

Date : 13 November 2025 07:23 PM Views : 110

Studio18 News - ANDHRA PRADESH / AMARAVATI : ఆయనతో పాటు ఇతర వైసీపీ నేతలపైనా కేసు పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో కేసు ఫైల్ పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఆరోపణ అనుమతి లేకుండా ప్రదర్శన నిర్వహించారని అభియోగం బీఎన్‌ఎస్‌ కింద పలు సెక్షన్లతో కేసు నమోదు మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. ఆయనతో పాటు మరికొందరు వైసీపీ నాయకులపై కూడా గుంటూరు జిల్లా పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతో పాటు వారిని బెదిరించారన్న ఆరోపణలపై ఈ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అంబటి రాంబాబు, ఇతర నేతలు ముందస్తు అనుమతులు లేకుండా భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ కారణంగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలగడంతో పాటు, ప్రజలకు అసౌకర్యం కలిగిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై చర్యలు తీసుకున్న పోలీసులు, విధుల్లో ఉన్న తమను బెదిరించారని పేర్కొంటూ కేసు నమోదు చేశారు. అంబటి రాంబాబుతో పాటు ఇతర నిందితులపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌)లోని 132, 126(2), 351(3), 189(2), రెడ్‌ విత్‌ 190 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు. ఈ ఘటనపై పోలీసులు తదుపరి దర్యాప్తు చేస్తున్నారు. గుంటూరు పట్టణంలో నిన్న వైద్య కళాశాలల పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంలో పోలీసులు అనుమతి లేదని అడ్డుకోవడంతో పోలీసులతో అంబటి వాగ్వివాదానికి దిగారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనపై పోలీసులు చర్యలు చేపట్టారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :