Sunday, 25 January 2026 05:56:48 AM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

ఏలూరు కలెక్టరేట్ లో కరోనా కలకలం... సిబ్బందికి కరోనా

Date : 31 May 2025 12:35 PM Views : 161

Studio18 News - ANDHRA PRADESH / : రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న సూచనలు కనిపిస్తుండగా, ఏలూరు జిల్లా కేంద్రంలో మహమ్మారి కలకలం సృష్టించింది. ఏలూరు కలెక్టరేట్‌లోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పనిచేస్తున్న నలుగురు సిబ్బందికి కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ పరిణామంతో కలెక్టరేట్ వర్గాలు అప్రమత్తమయ్యాయి. దీంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తక్షణ చర్యలు చేపట్టారు. పాజిటివ్ వచ్చిన ఉద్యోగులు ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. ముందు జాగ్రత్త చర్యగా కలెక్టరేట్‌లోని ఇతర ఉద్యోగులు, సిబ్బందికి కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాగా, నాలుగు రోజుల క్రితం ఏలూరు నగరంలోని శాంతినగర్‌కు చెందిన ఇద్దరు వృద్ధులకు కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది. వారిని మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరులోని ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. తాజా కేసులతో జిల్లాలో కొంత ఆందోళన నెలకొంది. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులను శుభ్రంగా ఉంచుకోవడం వంటి కొవిడ్ నిబంధనలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని, లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :