Studio18 News - ANDHRA PRADESH / Kakinada : కాకినాడ జిల్లా గండేపల్లి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో డ్రగ్స్ వద్దు బ్రో-సైకిల్ తొక్కు బ్రో నినాదంతో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. గండేపల్లి పోలీస్ స్టేషన్ నుంచి సింగరంపాలెం రోడ్డులోని ప్రభుత్వ ఆసుపత్రి వరకు ఈ ర్యాలీ సాగింది. ఎస్సై శివ నాగబాబు మాట్లాడుతూ ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించి, తమ పరిసరాల్లో గంజాయి, డ్రగ్స్ లేదా ఇతర మత్తు పదార్థాలపై ఎటువంటి సమాచారం ఉన్నా వెంటనే అధికారులకు తెలియజేయాలని కోరారు. ఇందుకోసం ప్రభుత్వం అందుబాటులో ఉంచిన ఈగల్ టోల్‌ఫ్రీ నంబర్ 1972కు కాల్ చేసి వివరాలు చెప్పాలని అన్నారు.
Admin
Studio18 News