Tuesday, 31 March 2026 04:35:05 PM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

Malla Ramgopal Naidu: కీర్తిచక్ర మేజర్‌కు ఏపీ ప్రభుత్వం భారీ నజరానా.. రూ.1.25 కోట్ల నగదు బహుమతి

Date : 28 January 2026 07:13 PM Views : 90

Studio18 News - ANDHRA PRADESH / AMARAVATI : కీర్తిచక్ర మేజర్ రామ్‌గోపాల్ నాయుడికి నగదు పురస్కారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలానికి చెందిన మేజర్ నాయుడు కశ్మీర్‌లో ఉగ్రవాదులను మట్టుబెట్టి, సహచరులను కాపాడినందుకు ఈ పురస్కారం 2024 స్వాతంత్య్ర దినోత్సవం సంద‌ర్భంగా ఆయనకు కీర్తిచక్ర ప్రకటించిన కేంద్రం కీర్తి చక్ర పురస్కార గ్రహీత, మేజర్ మల్లా రామ్‌గోపాల్‌నాయుడికి ఏపీ ప్రభుత్వం భారీ నగదు బహుమతి ప్రకటించింది. ఆయనకు రూ.1.25 కోట్లు అందిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు ఉత్తర్వులిచ్చారు. మేజర్ రామ్‌గోపాల్‌నాయుడు స్వస్థలం శ్రీకాకుళం జిల్లాలోని సంతబొమ్మాళి మండలం నగిరిపెంట గ్రామం. 2023 అక్టోబర్‌ 26న జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో జరిగిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లో మేజర్ రామ్‌గోపాల్ నాయుడు అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించారు. ప్రాణాలకు తెగించి ఉగ్రవాదులతో పోరాడి, తన సహచర సైనికుల ప్రాణాలను కాపాడారు. ఆయన వీరత్వానికి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 2024 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కీర్తి చక్ర పురస్కారాన్ని ప్రకటించింది. కుప్వారా జిల్లాలో ఉగ్రవాదులు చొరబడ్డారన్న సమాచారంతో రామ్‌గోపాల్ నాయుడు బృందం గాలింపు చర్యలు చేపట్టింది. స్థానిక ఇళ్లలో దాక్కున్న ఐదుగురు ఉగ్రవాదులు సైన్యంపై కాల్పులు జరపగా, మేజర్ రామ్‌గోపాల్ ఏమాత్రం వెనకాడకుండా ఎదురుదాడికి దిగారు. అత్యంత సమీపం నుంచి ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. మరో ఉగ్రవాది గ్రెనేడ్ విసరగా, చాకచక్యంగా తప్పించుకుని అతడిని కూడా హతమార్చారు. ఈ ఆపరేషన్‌లో మొత్తం ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టి ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. సాయుధ బలగాల్లో 'చక్ర' అవార్డులు పొందిన వారికి నగదు బహుమతులు అందించాలన్న ప్రభుత్వ విధానంలో భాగంగా ఏపీ సర్కార్ ఈ ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. శౌర్య పురస్కారం అందుకున్న ఏకైక తెలుగు మేజర్‌గా ఆయన ప్రశంసలు అందుకుంటున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :